ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Congress meet on UCC: సోనియాగాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం

ABN, First Publish Date - 2023-07-01T15:00:43+05:30

కేంద్ర పౌర స్మృతిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం జూలై 3న సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ నివారం సమావేశమవుతోంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసమైన 10 జనపథ్‌లో సమావేశం కానున్నారు. యూసీసీపై చర్చలో పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర పౌర స్మృతి (Uniform Civil Code-UCC)పై పార్లమెంటరీ స్థాయీ సంఘం (Parliamentary Standing Committee) జూలై 3న సమావేశం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ (Congress parliamentary Strategy Group) శనివారం సమావేశమవుతోంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) నివాసమైన 10 జనపథ్‌లో సమావేశం కానున్నారు. యూసీసీపై చర్చలో పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

జూలై 3న సమావేశానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్) పిలుపునిచ్చింది. యూసీసీపై సంబంధిత భాగస్వాములందరితోనూ స్టాండింగ్ కమిటీ చర్చించనుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ సారథ్యంలోని కమిటీ ఇందులోని 31 మంది ఎంపీలు, సభ్యులను తమతమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా కోరింది.

యూసీసీపై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చ లేవదీశారు. రెండు వేర్వేరు చట్టాలతో దేశం ఎలా మనుగడ సాధించగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. భారత రాజ్యాంగం సమానహక్కుల గురించి చెబుతుందని, సుప్రీంకోర్టు సైతం యూసీసీ అమలు చేయాలని చెబుతోందని, అయితే ఈ వ్యక్తులు (విపక్షాలు) మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారంటూ మోదీ విమర్శించారు. ప్రధానమంత్రి ప్రకటనతో యూసీసీ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రధాని యూసీసీ అంశాన్ని లేవెనత్తిట్టు విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్‌లో పరిస్థితి వంటి అంశాల నుంచి ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది. యూసీసీ అమలుతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ వ్యాఖ్యానించారు. హిందూ-ముస్లిం డైనమిక్స్‌పై మాత్రమే ఎందుకు దృష్టిసారిస్తున్నారని, తమ రాష్ట్రంలోని గిరిజన జనాభాను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మతం కోణంలో నుంచి సమాజాన్ని రెండుగా చీల్చేందుకు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ యూసీసీ చర్చ లేవనెత్తినట్టు కేరళ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల విమర్శించారు. కాగా, తాము అధికారంలోకి వస్తే యూసీసీని అమలు చేస్తామని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది.

Updated Date - 2023-07-01T15:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising