ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmir : మంచులో రాహుల్ గాంధీ ఆటలు

ABN, First Publish Date - 2023-02-16T11:59:57+05:30

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లో విహరిస్తున్నారు.

Rahul Gandhi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir)లో విహరిస్తున్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) పూర్తయిన తర్వాత ఆయన గుల్‌మార్గ్‌లో సేదదీరుతున్నారు. ఆయన బుధవారం మంచు కొండల్లో స్కీయింగ్ చేసి ఆనందానుభూతులను సొంతం చేసుకుంటున్నారు.

భారత్ జోడో యాత్ర జనవరి 30తో ముగిసిన సంగతి తెలిసిందే. రాహుల్ రెండు రోజులపాటు వ్యక్తిగత పర్యటన నిమిత్తం గుల్‌మార్గ్‌కు వచ్చారు. బుధవారం ఆయన స్కీయింగ్ చేయడంతోపాటు గొండోలా కేబుల్ కార్‌లో కూడా ప్రయాణించి, సంతోషించారు. గుల్‌మార్గ్ వెళ్ళడానికి ముందు ఆయన తంగ్‌మార్గ్ పట్టణంలో కాసేపు మజిలీ చేశారు. ఇక్కడికి కూడా ఆయన తన ట్రేడ్‌మార్క్ అయిన తెలుపు రంగు టీ-షర్ట్ ధరించి వచ్చారు. భారత్ జోడో యాత్రలో ఆయన ఇటువంటి టీ-షర్ట్‌నే ధరించిన సంగతి తెలిసిందే. అయితే గుల్‌మార్గ్ మంచు కొండల్లో స్కీయింగ్ చేసేటపుడు ఊలుతో తయారు చేసిన టోపీ, హెవీ డ్యూటీ జాకెట్, బూట్లు ధరించారు. ఆయనను చూసిన పర్యటకులు చాలా సంతోషంతో ఆయనతో సెల్ఫీలు దిగారు.

ఇదిలావుండగా, త్రిపుర శాసన సభ ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో రాహుల్ హాయిగా గడుపుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఆయనపై బీజేపీ నేతలు కూడా విమర్శలు గుప్పించారు.

త్రిపుర పోలింగ్

మొత్తం 60 స్థానాల్లో 259 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బీజేపీ (BJP)ని గద్దె దించాలనే లక్ష్యంతో బద్ధ శత్రువులైన కాంగ్రెస్, సీపీఎం ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఇండిజెనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర కూటమి, తిప్ర మోత, కాంగ్రెస్-సీపీఎం మధ్య ప్రధాన పోటీ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 2న జరుగుతుంది.

ఇవి కూడా చదవండి :

KotamReddy: ఏపీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టిన కోటంరెడ్డి

బాలికను నమ్మించి వెంట తీసుకువెళ్లిన ఇద్దరు యువకులు.. కాసేపటికి కుటుంబసభ్యులకు అసలు విషయం తెలిసేసరికి...

Updated Date - 2023-02-16T12:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising