ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

I.N.D.I.A : ఇండియా అన్ని మతాలను గౌరవిస్తుంది : కాంగ్రెస్ నేత

ABN, First Publish Date - 2023-09-07T21:03:38+05:30

ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా (I.N.D.I.A) అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా గురువారం చెప్పారు. ఒక విశ్వాసం కన్నా మరో విశ్వాసం తక్కువ అని ఎవరూ చెప్పలేరన్నారు.

Pawan Khera

న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా (I.N.D.I.A) అన్ని కులాలు, మతాలను గౌరవిస్తుందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా గురువారం చెప్పారు. ఒక విశ్వాసం కన్నా మరో విశ్వాసం తక్కువ అని ఎవరూ చెప్పలేరన్నారు. డీఎంకే ఎంపీ ఏ రాజా సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, కుష్ఠు వ్యాధితో పోల్చిన నేపథ్యంలో పవన్ ఈ వివరణ ఇచ్చారు.

ఏ రాజా వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించినపుడు పవన్ ఖేరా స్పందిస్తూ, కాంగ్రెస్ ఎల్లప్పుడూ సర్వధర్మ సమభావాన్ని నమ్ముతుందన్నారు. ప్రతి మతం, ప్రతి విశ్వాసానికి చోటు ఉంటుందన్నారు. ఒక మతం మరొక మతం కన్నా తక్కువ అని ఎవరూ చెప్పలేరన్నారు. అటువంటి వ్యాఖ్యలను రాజ్యాంగం అనుమతించదని, కాంగ్రెస్ కూడా విశ్వసించదని చెప్పారు.

తమ కూటమిలోని భాగస్వామ్య పక్షం డీఎంకే వద్ద ఈ అంశాన్ని తాము లేవనెత్తవలసిన అవసరం లేదన్నారు. తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ప్రతి మతాన్ని గౌరవిస్తాయనే విషయం తమకు తెలుసునని చెప్పారు. ఎవరైనా చేసిన వ్యాఖ్యలను మీరు మెలితిప్పాలనుకుంటే స్వేచ్ఛగా ఆ పని చేసుకోవచ్చునన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తగినదని అనుకుంటే, ఆయనను కూడా మెలితిప్పనివ్వండన్నారు. అయితే ఇండియా కూటమిలోని ప్రతి పార్టీకి అన్ని మతాలు, కులాల పట్ల గౌరవం ఉందని తెలిపారు. మోదీ బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మంత్రులకు కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లు వచ్చిన వార్తలను పవన్ ఖేరా ప్రస్తావించారు.


ఉదయనిధి వ్యాఖ్యలు

డీఎంకే నేత, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటిదని, వీటిని వ్యతిరేకించలేమని, నిర్మూలించడం ఒక్కటే సరైనదని, సనాతన ధర్మాన్ని కూడా సమూలంగా నిర్మూలించాలని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, బీజేపీ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దీని గురించి ప్రస్తావించినట్లు వార్తలు వచ్చాయి. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలపై దీటుగా, రాజ్యాంగబద్ధంగా, వాస్తవాలు చెప్తూ స్పందించాలని కేంద్ర మంత్రులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. డీఎంకే నేత ఏ రాజా గురువారం మాట్లాడుతూ, ఉదయనిధి స్టాలిన్‌ను సమర్థించారు. సనాతన ధర్మం కుష్టు రోగం, ఎయిడ్స్‌ వంటిదని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

Hello! UPI : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త!

Eradicate Sanatana Dharmam : మోదీపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం

Updated Date - 2023-09-07T21:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising