ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maharashtra: సెప్టెంబర్‌లో సీఎం మార్పు... కాంగ్రెస్ జోస్యం..!

ABN, First Publish Date - 2023-08-19T15:10:11+05:30

మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని, సెప్టెంబర్ కల్లా మార్పులు ఉంటాయని, సీఎం సీటు ప్రమాదంలో పడుతుందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ శనివారంనాడు జోస్యం చెప్పారు.

ముంబై: మహారాష్ట్ర (Maharashtra) లోని ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని, సెప్టెంబర్ కల్లా మార్పులు ఉంటాయని, సీఎం సీటు ప్రమాదంలో పడుతుందని మహారాష్ట్ర అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ (Vijay Wadettiwar) జోస్యం చెప్పారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, మహారాష్ట్రలో ఇంతవరకూ జరిగినదేదీ సజావుగా లేదని, ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని ఉన్నారు. సీఎం సీటుకు ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ముఖ్యమైన పీఠానికి (CM chair) సెప్టెంబర్‌లో మార్పు ఉండబోతోందని తెలిపారు.


సర్కార్ కొనసాగడంపై ఊహాగానాలు

బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ (అజిత్ పవార్ వర్గం) ప్రభుత్వం ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే దానిపై కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి సీటుకు ముప్పుందనే ఊహాగానాలు సైతం ఉన్నాయి. అజిత్ పవార్ తన 8 మంది ఎమ్మెల్యేలతో జూలై 2న మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరడం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేలంతా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఈ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. గత నెలలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, షిండే స్థానంలో అజిత్ పవార్‌ను సీఎం చేస్తున్నారని చెప్పారు. అయితే, ఆయన వాదనను బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తోసిపుచ్చారు. షిండే ప్రభుత్వంలో మార్పులు ఉండవని, ఆయనే సీఎంగా కొనసాగుతారని తెలిపారు. 2022 జూలైలో శివసేనలో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగురవేసి పార్టీని చీల్చడంతో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో బీజేపీతో షిండే పొత్తు పెట్టుకుని సీఎం పదవిని చేపట్టారు.

Updated Date - 2023-08-19T15:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising