ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress : కాంగ్రెస్‌కు అంతు చిక్కని సచిన్ పైలట్ వ్యవహారం

ABN, First Publish Date - 2023-06-11T10:25:30+05:30

రాజస్థాన్ కాంగ్రెస్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వైరం ఎప్పుడు ముగుస్తుందోనని ఆ పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోధ్‌పూర్ : రాజస్థాన్ కాంగ్రెస్‌లో అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య వైరం ఎప్పుడు ముగుస్తుందోనని ఆ పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge), రాహుల్ గాంధీ (Rahul Gandhi)లతో ఈ ఇరువురు నేతలు చర్చించినప్పటికీ, ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్లు కనిపించడం లేదు. సచిన్ పైలట్ ఇప్పటికీ అందరినీ ఊహల్లోకి నెడుతున్నట్లే వ్యవహరిస్తున్నారు. సచిన్ (Sachin Pilot) తన తండ్రి రాజేశ్ పైలట్ (Rajesh Pilot) వర్థంతి సందర్భంగా ఆదివారం పంపించిన నర్మగర్భ సందేశం కాంగ్రెస్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

సచిన్ పైలట్ ఇచ్చిన ట్వీట్‌లో, తన తండ్రి రాజేశ్ పైలట్‌ వర్థంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. రాజేశ్ తన కార్యస్థానంతో ఎంతో అనుబంధంతో పని చేసేవారని తెలిపారు. ప్రజలతో ఆయనకు గొప్ప సత్సంబంధాలు ఉండేవన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన అంకితభావంతో పని చేశారన్నారు. ఆయన తన సిద్ధాంతాలతో ఎన్నడూ రాజీ పడలేదన్నారు. ప్రజా శ్రేయస్సుకే పెద్ద పీట వేశారన్నారు. తన తండ్రి తనకు మార్గదర్శి అని తెలిపారు. ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలనే తాను ఎల్లప్పుడూ అనుసరిస్తానని చెప్పారు.

ఈ ట్వీట్ కాంగ్రెస్‌లోని అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) అభిమానులను కలవరపెడుతోంది. తన తండ్రి తనకు మార్గదర్శి అని, ఆయన సిద్ధాంతాలతో ఎన్నడూ రాజీ పడలేదని చెప్పడాన్నిబట్టి, ప్రస్తుతం తాను అశోక్ గెహ్లాట్‌తో రాజీ పడబోననే సంకేతాలను పంపిస్తున్నారా? అనే అనుమానంతో ఆందోళన చెందుతున్నారు. ఏదోవిధంగా ఈ అంతర్గత సమస్య సానుకూలంగా పరిష్కారమైతే బాగుంటుందని భావిస్తున్నారు.

ఇదిలావుండగా, సచిన్ పైలట్ తన తండ్రి వర్థంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం ఓ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. తన తదుపరి కార్యాచరణను ఆయన ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆయన కొత్తగా ఓ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అయితే కాంగ్రెస్ (Congress) పెద్దలు ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) శుక్రవారం మాట్లాడుతూ, రానున్న రాజస్థాన్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐకమత్యంగా పోటీ చేస్తుందన్నారు. తాను వదంతులను నమ్మబోనని చెప్పారు. మరోవైపు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సత్సంబంధాల పునరుద్ధరణ పగటి కలగానే కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి :

Chief Minister: సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఆ రాష్ట్రం సహా 40 చోట్ల గెలుపు మాదే..

Wrestlers : ఆధారాలివ్వండి : ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు

Updated Date - 2023-06-11T10:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising