ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mallikarjun Kharge: దేశంలో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి.. బీజేపీ పెట్రోల్ పోసి ఆ అగ్నికి మరింత ఆజ్యం పోస్తోంది

ABN, First Publish Date - 2023-09-16T21:23:10+05:30

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మల్లికార్జున ఖర్గే బీజేపీని తనదైన శైలిలో ఎండగడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తన విమర్శల దాడిని..

కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మల్లికార్జున ఖర్గే బీజేపీని తనదైన శైలిలో ఎండగడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తన విమర్శల దాడిని మరింత పెంచారు. ఇప్పుడు మరోసారి ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. మన భారతదేశం తీవ్రమైన అంతర్గత సవాళ్లను ఎదుర్కుంటోందని.. హింసాత్మక సంఘటనపు మన దేశపు ప్రతిష్టను దిగజార్చుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి.. పెట్రోల్ పోసి అగ్గిని మరింత రాజేలా చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఖర్గే మాట్లాడుతూ.. సమాజంలోని అణగారిన వర్గాల కోసం ఆరోగ్యం, విద్య, ఉపాధి, ఆహార భద్రత హక్కును పొందేందుకు కుల సర్వేతో పాటు జనాభా లెక్కల ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. తమ ఇండియా కూటమిలో ఉన్న 27 రాజకీయ పార్టీలు.. ముఖ్యమైన ప్రాథమిక సమస్యలపై ఏకతాటిపై నిలబడ్డాయని అన్నారు. మూడు సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన అనంతరం.. తన ఇండియా కూటమి ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ పరిణామంతో ఆందోళన చెందిన బీజేపీ ప్రభుత్వం.. ప్రతిపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.


పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను అణిచివేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఖర్గే తెలిపారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. అధికార పార్టీ ఉద్దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్‌లో చెలరేగుతున్న హింస, విస్తరిస్తున్న అసమానతలు, రైతులు - కార్మికుల్లో క్షీణిస్తున్న పరిస్థితిని నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. మణిపూర్‌లో ఇప్పటికీ జరుగుతున్న విషాదకర సంఘటనలను దేశం మొత్తం చూస్తోందని.. మోదీ ప్రభుత్వం మణిపూర్ అగ్నిని హర్యానాలోని నుహ్‌కు చేరుకోవడానికి అనుమతించిందని ఫైరయ్యారు.

ఈ హింసాత్మక సంఘటనలు.. ఆధునిక, ప్రగతిశీల, లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ, మతతత్వ సంస్థలు, మీడియాలోని ఒక వర్గం.. అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో పడిందని.. ఇది సామాన్య ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావితం చూపుతోందని ఖర్గే చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-09-16T21:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising