ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఈ లవర్స్‌కు ఇదేం పోయే కాలం.. హైస్పీడ్ బైక్‌పై హైవే మీద ముద్దులాట!

ABN, First Publish Date - 2023-06-22T13:03:51+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల ఢీల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ ప్రేమ జంట బరితెగించి ప్రవర్తించింది. నిత్యం రద్దీగా ఉండే ఆ హైవే మీద ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా కూర్చొని సదరు ప్రేమజంట ఆడిన ముద్దులాట ఇతర వాహనదారులను ఆశ్చర్యంతోపాటు ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనను కారులో వెళ్తున్న ఓ వ్యక్తి రికార్డు చేసి వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తరప్రదేశ్: పాత కాలంలో ప్రేమికులు ఉత్తరాలలోనే తమ భావాలను వ్యక్తపరుచుకునేవారు. అక్షరాల రూపంలో తమ ప్రేమను బంధించి మనసిచ్చిన వారికి చేర్చేవారు. నేరుగా కలిసి మాట్లాడుకోవాలంటే మహా సిగ్గు, అంతకుమించి ఎవరైనా చూస్తారేమో అనే భయం. ఆ తర్వాత ల్యాండ్ లైన్‌లు, మొబైల్స్ వచ్చాక కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం వంటివి చూశాం. ఇక ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్‌లు, చాటింగ్ యాప్‌లు వచ్చాక నిరంతరం చాటింగ్‌లో ఉండడం, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం ఓ వ్యసనంగా మారిపోయింది. అయితే ఇదంతా పక్కవారికి తెలియకుండానే జరిగిపోయేది. తమకు అత్యంత సన్నిహితంగా ఉండేవారికి మినహా.. ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడేవారు. అయితే ప్రస్తుతం ఆ దశ కూడా దాటిపోయింది. ఎవరు చూస్తున్నా, ఇతరులకు ఇబ్బంది కల్గుతున్న ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రేమ పేరుతో నాలుగు గోడల మధ్య చేయాల్సింది, పబ్లిక్‌లోనే కానిచ్చేస్తున్నారు. దీంతో చరిత్రలో అద్భుతంగా వర్ణించిన ప్రేమను వారి వ్యామోహంతో కామంగా మార్చేస్తున్నారు. నడి రోడ్డుపై ముద్దులతో రెచ్చిపోతున్నారు.

అచ్చం అలాంటి ఘటనే ఒకటి తాజాగా బయటికొచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల ఢీల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఓ ప్రేమ జంట బరితెగించి ప్రవర్తించింది. నిత్యం రద్దీగా ఉండే ఆ హైవే మీద ద్విచక్ర వాహనంపై ఎదురెదురుగా కూర్చొని సదరు ప్రేమజంట ఆడిన ముద్దులాట ఇతర వాహనదారులను ఆశ్చర్యంతోపాటు ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనను కారులో వెళ్తున్న ఓ వ్యక్తి రికార్డు చేసి వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో వీడియోను అప్‌లోడ్ చేసిన వ్యక్తి పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ట్యాగ్ చేశాడు. అంతేకాకుండా దానికి క్యాప్షన్‌గా ‘‘ఈ ప్రేమ జంట ఎటువంటి రోడ్డు నిబంధనలు పాటించడం లేదు. సమాజం గురించి ఆందోళన చెందడం లేదు.’’ అని రాసుకొచ్చాడు.

వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం రద్దీగా ఉన్న హైవేపై ఓ ప్రేమ జంట ద్విచక్ర వాహనంపై వేగంగా ప్రయాణిస్తుంది. యువకుడు ద్విచక్ర వాహనాన్ని నడుపుతుండగా.. యవతి పెట్రోల్ ట్యాంక్‌పై అతనికి ఎదురుగా కూర్చుంది. యువకుడిని గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారు. ఈ లోకాన్ని సైతం మర్చిపోయి కామంలో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు సదరు ప్రేమ జంటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అయితే ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన ఘజియాబాద్ కమిషనరేట్ డీసీపీ ట్రాన్స్ హిండన్.. సదరు జంటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందిరాపురం ఎస్ఐని ఆదేశించారు. అయితే ఇటువంటి ఘటనలు కొత్తేమి కాదు. ఇటీవల రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. ప్రేమజంటలు పబ్లిక్ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తమకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఇతరులను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ఏది ఏమైనా ఇటువంటి ప్రేమ జంటలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.

Updated Date - 2023-06-22T13:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising