ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi liquor case : చార్జిషీట్‌లో పేరు పొరపాటున రాశారా? : కేజ్రీవాల్ ఆగ్రహం

ABN, First Publish Date - 2023-05-03T15:44:14+05:30

ఢిల్లీ మద్యం కుంభకోణం పూర్తిగా బూటకమని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal) అన్నారు

Sanjay Singh , Arvind Kejriwal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం పూర్తిగా బూటకమని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Delhi chief minister Arvind Kejriwal) అన్నారు. తమ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేరును పొరపాటున ఛార్జిషీటులో చేర్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) చెప్పడమే దీనికి నిదర్శనమని చెప్పారు. మరోవైపు సంజయ్ సింగ్ కూడా ఈడీ అధికారులకు లీగల్ నోటీసులు పంపించారు.

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత (MLC Kavita)ను ఈడీ ప్రశ్నించింది. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) పేరు ఈడీ ఛార్జిషీటులో నాలుగు చోట్ల ఉంది. వీటిలో ఒక చోట అనుకోకుండా ఆయన పేరు పడింది. అనుకోకుండా టైప్ అయిన ఈ పేరును సరిదిద్దడం కోసం కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఛార్జిషీటులో తన పేరును పొరపాటున రాసినట్లు ఈడీ తనకు సమాచారం ఇచ్చిందని సంజయ్ సింగ్ వెల్లడించారు. ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ సింగ్‌లను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ అధికారులు తన పేరును ఉద్దేశపూర్వకంగానే రాశారని, అవాస్తవమైన, పరువు నష్టం కలిగించే, నేరంలో ఇరికించే విధంగా తన పేరును ఉద్దేశపూర్వకంగానే ఛార్జిషీటులో రాశారని ఆరోపించారు. ఈ అధికారులకు తాను లీగల్ నోటీసులు పంపించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో ఈడీ అధికారులపై విరుచుకుపడ్డారు. ఓ వ్యక్తి పేరును ఛార్జిషీటులో పొరపాటున కూడా రాసేస్తారా? అని ప్రశ్నించారు. ఈ కేసు మొత్తం బూటకమని దీనినిబట్టి అర్థమవుతోందన్నారు. దేశంలో అత్యంత నిజాయితీగల పార్టీని, కుళ్లు రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న పార్టీని అప్రతిష్ఠపాలు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇదంతా చేస్తున్నారన్నారు. ఇది వారికి తగదని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

MeToo Protest : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై ఒలింపియన్ వినేష్ ఫోగట్ ఆరోపణలు

Karnataka Polls : కర్ణాటకలో చెట్లకు కరెన్సీ కట్టల పంట.. ఆశ్చర్యపోతున్న ఐటీ అధికారులు..

Updated Date - 2023-05-03T15:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising