ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Excise Policy Case : మనీశ్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2023-04-28T16:49:36+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కు ఢిల్లీ ఎక్సయిజ్ విధానం

Manish Sisodia
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు ఢిల్లీ ఎక్సయిజ్ విధానం (Delhi Excise Policy 2021-22) కేసులో మరోసారి ఢిల్లీ రౌస్ ఎవెన్యూ జిల్లా కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో బెయిలు కోసం ఆయన చేసిన దరఖాస్తును కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఈడీ తరపున జొహెబ్ హొస్సేన్, సిసోడియా తరపున దయన్ కృష్ణన్ వాదనలు వినిపించారు. సిసోడియాకు బెయిలు మంజూరు చేసేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌‌పాల్ నిరాకరించారు.

ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి, అక్రమాలు జరిగినట్లు సీబీఐ (Central Bureau of Investigation), ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్ట్ చేయగా, మార్చి 9న ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. ఆయనను పలుమార్లు సీబీఐ, ఈడీ ప్రశ్నించాయి.

సీబీఐ కేసులో బెయిలు కోసం సిసోడియా చేసిన దరఖాస్తును మార్చి 31న స్పెషల్ జడ్జి తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆయన బెయిలు దరఖాస్తుపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరుపుతోంది. ఈడీ కస్టడీకి సిసోడియాను రిమాండ్ చేసినపుడు కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎక్సయిజ్ విధానం రూపకల్పన, అమలులో ప్రతి దశలోనూ సిసోడియా ప్రముఖ పాత్ర పోషించారని వ్యాఖ్యానించింది. మనీలాండరింగ్ కేసులో ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయమేనని తెలిపింది.

ఈడీ చేసిన ఆరోపణల ప్రకారం, కుట్రలో భాగంగానే ఈ ఎక్సయిజ్ విధానాన్ని రూపొందించి, అమలు చేశారు. కొన్ని ప్రైవేటు కంపెనీలకు హోల్‌సేల్ బిజినెస్ ప్రాఫిట్ 12 శాతం ఇవ్వడం కోసం కుట్ర జరిగింది. మంత్రుల బృందం సమావేశాల చర్చనీయాంశాల్లో దీనికి సంబంధించిన అంశాలేవీ లేవు. హోల్‌సేలర్లకు అసాధారణ లాభాలను కట్టబెట్టడం కోసం సౌత్ గ్రూప్‌తో కలిసి విజయ్ నాయర్, మరికొందరు సమన్వయంతో ఈ కుట్రకు పాల్పడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాల తరపున విజయ్ నాయర్ పని చేశారు.

సిసోడియా 14 ఫోన్లను ధ్వంసం చేశారని, వీటిలో రెండిటిని మాత్రమే తిరిగి స్వాధీనం చేసుకోగలిగామని ఈడీ తెలిపింది. ఫోన్లను ధ్వంసం చేసి సాక్ష్యాధారాలను నాశనం చేశారని తెలిపింది. ఇతరుల పేరు మీద కొన్న సిమ్ కార్డులను, ఫోన్లను సిసోడియా వాడినట్లు తెలిపింది. ఈ కుంభకోణం వల్ల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.2,600 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి :

Karnataka Elections: సోనియా విషకన్య ... బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు

India Vs China : చైనాకు తెగేసి చెప్పిన భారత్

Updated Date - 2023-04-28T16:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising