ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Excise policy Scam: సిసోడియా కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు, బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN, First Publish Date - 2023-03-04T15:58:28+05:30

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణం కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కస్టడీని మరో రెండు రోజుల పాటు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కుంభకోణం (Delhi Excise Policy Scam) కేసులో సీబీఐ అరెస్టు చేసిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) కస్టడీని మరో రెండు రోజుల పాటు రౌస్ ఎవెన్యూ కోర్టు పొడిగించింది. దీంతో ఈనెల 6వ తేదీ వరకూ సిసోడియా సీబీఐ కస్టడీలోనే కొనసాగుతారు. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను కూడా కోర్టు ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. సిసోడియా బెయిల్ అభ్యర్థనపై సీబీఐకి కోర్టు నోటీసులు పంపింది.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సీబీఐ 5 రోజుల కస్టోడియల్ రిమాండ్‌ శనివారంతో ముగియనుండటంతో ఆయనను భారీ భద్రత మధ్య కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌ ముందు ఢిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌ను మోహరించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆయనను కోర్టుకు తీసుకురాగా, మరో మూడు రోజుల సీబీఐ కస్టడీని కోర్టు కోరింది. కస్టడీ పొడిగించాల ని సీబీఐ కోరడం సరికాదని సిసోడియా తరఫు సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ వాదించారు. సీబీఐ 9 నుంచి 10 గంటల సేపు సిసిడియాను కూర్చోపెట్టి, అడిగిందే పదేపదే అడుగుతూ వచ్చిందని, ఇది మానసికంగా వేధించడమేనని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.

సిసోడియా సహకరించడం లేదు...

దీనికి ముందు, ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కోసులో విచారణకు సిసోడియా సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. సిసోడియా కార్యాలయం నుంచి గత జనవరిలో ఒక కంప్యూటర్‌ను సీజ్ చేశామని, ఆ కంప్యూటర్ నుంచి ఫైళ్లు, ఇతర డాటా తొలగించినట్టు కనుగొన్నామని సీబీఐ వర్గాలు తెలిపాయి. తొలగించిన ఫైళ్లను రిట్రైవ్ చేసేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌‌కు పంపామని, కంప్యూటర్ నుంచి డిలీట్ చేసిన మొత్తం ఫైల్‌ను రిట్రైవ్ చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన నివేదికను ఎఫ్ఎస్‌ఎల్ ఇచ్చిట్టు సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి.

ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తా: సిసోడియా

సీబీఐ ఎప్పుడు విచారణకు పిలిచినా తాను హాజరయ్యేందుకు సిద్ధమని సిసోడియా తెలిపారు. ఈ కేసులో సీబీఐ స్వాధీనం చేసుకున్నవన్నీ ఆ ఏజెన్సీ దగ్గరే ఉన్నందున తనను కస్టడీలో ఉంచడం వల్ల ఎలాటి ప్రయోజనం ఉండదని బెయిల్ పిటిషన్‌లో సిసిడియా పేర్కొన్నారు.

సిసోడియా పాత్ర ఏంటి?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించాడని రిమాండ్ పేపర్‌లో సీబీఐ ఆరోపించింది. ''కేవలం కొంత మంది లిక్కర్ వ్యాపారులకు లబ్ధి కలిగించేందుకే ఎక్సైజ్ పాలసీని సిసోడియా మార్పుచేశారు. సౌత్ ఇండియా బేస్డ్ లిక్కర్ వ్యాపారులు, రాజకీయనేతల అధీనంలోని సౌత్ గ్రూప్ ద్వారా ఈ కేసులో నిందితుడైన విజయ్ నాయర్ రూ.100 కోట్లు వసూలు చేశాడు. ఈ పాలసీ ద్వారా సౌత్ గ్రూప్‌కే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. హవాలా మార్గాల ద్వారా రూ.100 కోట్ల చెల్లింపులు జరిగాయి. వాటిని మేము కనిపెట్టాం. 2021 సెప్టెంబర్, అక్టోబర్ మధ్య సిసోడియా 14 సెల్‌ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు మార్చారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడమే సెల్‌ఫోన్లు మార్చడం వెనుక ప్రధాన ఉద్దేశం. ఈ మొబైల్ ఫోన్లను సిసోడియా సెక్రటరీ ధర్మేంద్ర శర్మ సమకూర్చారు. ఇందుకు సంబంధించి ఆయన స్టేట్‌మెంట్ కూడా తీసుకున్నాం'' అని సీబీఐ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ కేసులో ఇంతవరకూ ఏడుగురిపై సీబీఐ ఛార్జిషీటు నమోదు చేసింది. అనుబంధ ఛార్జిషీటును కూడా సిద్ధం చేస్తోంది.

Updated Date - 2023-03-04T16:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!