PM MOdi in Varanasi: కాశీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 'మహదేవ్'కు అంకితం: మోదీ
ABN, First Publish Date - 2023-09-23T15:36:05+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియానికి శనివారంనాడు శంకుస్థాపన చేశారు. మహదేవుని నగరంలో శివతత్వం ఉట్టిపడే డిజైన్‌తో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని మహదేవునికే అంకితం చేయనున్నట్టు మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు.
లక్నో: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (Varanasi)లో అంతర్జాతీయ క్రికెట్ స్డేడియానికి (International Cricket Stadium) శనివారంనాడు శంకుస్థాపన చేశారు. మహదేవుని (Mahadev) నగరంలో శివతత్వం ఉట్టిపడే డిజైన్‌తో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని మహదేవునికే అంకితం చేయనున్నట్టు మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. కాశీలోని అంతర్జాతీయ స్టేడియ నిర్మాణంతో స్థానిక క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. పూర్వాంచల్ ప్రాంతానికే ఈ స్డేడియం తలమానికమని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేర్కొన్నారు. దీనికి ముందు స్టేడియానికి చేరుకున్న ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, ప్రముఖ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, మదన్ లాల్, దిలీప్ వెంగ్‌సర్కార్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జే షా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ఈరోజు నుంచి ఆసియన్ గేమ్స్ ప్రారంభమవుతున్నాయని, ఈ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందికీ అభినందలు తెలియజేస్తున్నానని అన్నారు. క్రీడల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు క్రీడల పట్ల మన దృక్కోణం మారుతోందనడానికి సాక్ష్యంగా నిలుస్తోందని చెప్పారు. క్రీడాకారులకు ప్రతి స్థాయిలోనూ ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని అన్నారు. అలాంటి ప్రభుత్వ పథకల్లో టీఓపీఎస్ ఒకటని తెలిపారు.
కాగా, కాశీ విశ్వేశ్వరుని స్ఫూర్తితో ఈ స్డేడియాన్ని డిజైన్ చేస్తున్నారు. అర్ధచంద్రాకారం తరహాలో రూఫ్ కవర్, త్రిశూలం తరహాలో ఫ్లడ్‌లైట్లు, ఘాట్ మెట్ల తరహా సీటింగ్ ఏర్పాట్లు వంటివి ఉండబోతున్నాయి. 30,000 మంది ప్రేక్షకులు కూర్చునేందుకు అవకాశం ఉన్న ఈ స్డేడియాన్ని 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. రూ.450 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. భూమి సేకరణ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ.121 కోట్లు వెచ్చింది. బీసీసీసీఐ రూ.331 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనుంది.
Updated Date - 2023-09-23T15:36:05+05:30 IST