Earthquake: దేశంలో ఒకే రోజు మూడు ప్రాంతాల్లో భూకంపం
ABN, First Publish Date - 2023-04-12T11:49:22+05:30
దేశంలో బుధవారం ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది....
దేశంలో బుధవారం ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి, బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా ప్రాంతాల్లో భూకంపం సంభవించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.
శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో బుధవారం ఉదయం 10.10 గంటలకు భూకంపం సంభవించింది.(Earthquake) జమ్మూకశ్మీరును(Jammu and Kashmir) వణికించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైందని నేషనల్ సీస్మాలజీ శాస్త్రవేత్తలు చెప్పారు. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని జమ్మూకశ్మీర్ అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి, బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా వద్ద భూమి కంపించింది.
ఇది కూడా చదవండి : Bathinda: మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు...నలుగురి మృతి
ఒకే రోజు దేశంలో మూడు ప్రాంతాల్లో భూకంపం రావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలోని బీహార్, సిలిగురిలలో బుధవారం భూకంపం సంభవించింది.బీహార్ రాష్ట్రంలోని అరారియా సమీపంలోని పూర్ణియా వద్ద బుధవారం ఉదయం 5.35 గంటలకు భూకంపం సంభవించింది.(Earthquake) ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ(National Center for Seismology) వెల్లడించింది. ఈ వరుస భూకంపాలతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు.
Updated Date - 2023-04-12T11:49:22+05:30 IST