Delhi Liquor Policy Scam: లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. సీఎంకు ఈడీ సమన్లు
ABN, Publish Date - Dec 18 , 2023 | 06:59 PM
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు సమన్లు పంపింది. లిక్కర్ కేసులో ప్రశ్నించేందుకు ఈనెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఈ సమన్లలో కోరింది.
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం (Delhi liquor policy scam) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సోమవారంనాడు సమన్లు పంపింది. లిక్కర్ కేసులో ప్రశ్నించేందుకు ఈనెల 21వ తేదీన తమ ముందు హాజరు కావాలని ఈ సమన్లలో కోరింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం ఇది రెండోసారి. ఈడీ ఇంతకు ముందు నవంబర్ 2న సమన్లు పంపగా, ఈడీ సమన్లు చట్టవిరుద్ధమంటూ ఈడీ ముందు హాజర్యయేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు.
సీఎం ముందస్తు షెడ్యూల్...
కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ వారంలో 10 రోజుల విపాసన మెడిటేషన్ కోర్సుకు అజ్ఞాత ప్రాంతానికి వెళ్లాలని కేజ్రీవాల్ నిర్ణయించుకున్నారు. ఢిల్లీ శీతాకాల సమావేశాలు పూర్తయిన మరుసటి రోజే.. డిసెంబర్ 19న ఆయన ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఏడాది కేజ్రీవాల్ డిసెంబర్ 19 నుంచి 30 వరకూ విసాసన కోర్సుకు వెళ్తుంటారని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న తమ ముందు హాజరుకావాలంటూ ఈజీ తాజా సమన్లు పంపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, గత ఏప్రిల్ 16న ఈ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ తొమ్మిది గంటలకు పైగా ప్రశ్నించింది.
Updated Date - Dec 18 , 2023 | 06:59 PM