ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Election Commission of India: ఈసీ కీలక నిర్ణయం.. జాతీయ హోదా కోల్పోయిన మూడు పార్టీలు.. కేసీఆర్‌‌కూ ఊహించని పరిణామం

ABN, First Publish Date - 2023-04-10T20:49:20+05:30

కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India ) కీలక నిర్ణయం తీసుకుంది.

Election Commission of India
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్సీపీ(NCP), సీపీఐ(CPI), టీఎంసీ(TMC) జాతీయ హోదా కోల్పోయాయని ప్రకటించింది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి( Aam Aadmi Party ) పండగలాంటి వార్త తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా ప్రకటించింది.

మరోవైపు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా ప్రకటించిన కేసీఆర్‌కు ఈసీ షాకిచ్చింది. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించింది. బీఆర్ఎస్ తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని ఈసీ వెల్లడించింది.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(Communist Party of India) భారత్‌కు స్వాతంత్ర్యం రాకముందే ఏర్పాటైంది. 1964లో సీపీఐ, సీపీఐ(ఎం) విడిపోయాయి. ఆ తర్వాత సీపీఐ(ఎం) పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళలో అధికారంలోకి రాగలింది. అయితే సీపీఐకి మాత్రం కొన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉంది. సీపీఐ క్రమంగా ప్రాభవం కోల్పోయి చివరకు జాతీయ పార్టీ హోదాను కోల్పోయింది. సీపీఐకి డి.రాజా ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నారాయణ సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు.

తృణమూల్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉంది. మమతా బెనర్జీ టీఎంసీ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో సభ్యులున్నా జాతీయ స్థాయిని కాపాడుకునే స్థాయిలో లేరు.

ఇక ఎన్సీపీ విషయానికొస్తే 1998కి ముందు కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఉన్న శరద్ పవార్ సోనియా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టగానే ఆమె విదేశీయతను ప్రశ్నించి వేరు కుంపటి పెట్టారు. సంగ్మా తదితరులను వెంటబెట్టుకుని బయటకు వచ్చారు. మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరిట పార్టీని ప్రారంభించారు. కొన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉన్నా జాతీయ స్థాయిని కాపాడుకునే పరిస్థితి లేదు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీతో పాటు పంజాబ్‌లో అధికారంలో ఉంది. గుజరాత్‌లో తక్కువ సీట్లు వచ్చినా ఓట్ షేర్ గణనీయంగా ఉండటంతో జాతీయ హోదా దక్కింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఆప్‌కు ఉనికి ఉంది.

యూపీలో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), పశ్చిమ బెంగాల్‌లో రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్పీ)లకు రాష్ట్ర పార్టీ హోదా రద్దు అయింది. త్రిపురలో తిప్రా మోతా పార్టీకి, మేఘాలయలో వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీకి, నాగాలాండ్‌లో లోక్ జనశక్తి (రాంవిలాస్) పార్టీకి రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు లభించింది.

ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్ & అలాంట్‌మెంట్) ఆర్డర్, 1968లోని పారా 6 ప్రకారం ఈసీ తాజా నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర పార్టీగా గుర్తింపు కోసం ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు లేదా మొత్తం అసెంబ్లీ సీట్లలో 3% సీట్లు లేదా 25 ఎంపీ సీట్లకు ఒక సీటైనా గెలిచి ఉండాలి. అలాగే పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లైనా వచ్చి ఉండాలి. ఏపీలో 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్‌కు రాష్ట్ర పార్టీ గుర్తింపు లభించలేదు.

Karnataka Assembly elections: బీజేపీ జాబితా విడుదల వేళ దుమారం

Sharad Pawar: శరద్ పవార్ వ్యూహాలతో కాంగ్రెస్‌లో కలకలం

Ghulam Nabi Azad: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఆజాద్ గుబులు




Updated Date - 2023-04-10T21:00:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising