ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wayanad Bypoll: రాహుల్ వయనాడ్‌‌‌కు ఉప ఎన్నిక ఎప్పుడంటే..?

ABN, First Publish Date - 2023-03-25T16:05:56+05:30

పార్లమెంటు సభ్యుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడిగా రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళ (Kerala)లోని వయనాడ్ (Wayanad) లోక్‌సభ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. సెప్టెంబర్‌లో ఇక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే ఇతమిత్థంగా ఏ తేదీన ఎన్నిక నిర్వహిస్తారనేది భారత ఎన్నికల కమిషన్ (Election Commission of India) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాగా రాహుల్ పరిణామంపై ఈసీ ఇంతవరకు స్పందించలేదు.

కాగా రాహుల్‌పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వయనాడ్ లోక్‌సభ సీటుకు ప్రజాప్రాతినిధ్యం చట్టం-2015లోని సెక్షన్ 151ఏ కింద ఆరు నెలల్లోపు ఉపఎన్నిక జరపాల్సి ఉంటుంది. దోషిగా నిరూపణపై కనీసం రెండేళ్ల పాటు శిక్ష పడిన ఎంపీ ఎవరైనా సరే అనర్హత వేటుకు అర్హుడని సెక్షన్ 8(3) చెబుతోంది. ఇదే సెక్షన్ కింద రాహుల్‌పై లోక్‌సభ సెక్రటేరియట్ శుక్రవారంనాడు అనర్హత వేటు వేసింది. దీంతో ఉపఎన్నిక తేదీని ప్రకటించే బాధ్యత ఇప్పుడు ఎన్నికల సంఘంపై ఉంది. లోక్‌సభలో ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. ఒకటి జలంథర్ కాగా, మరొకటి వయనాడ్.

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ హైకోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 కింద లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. సూరత్ కోర్టు తన తీర్పును పైకోర్టులో సవాలు చేసుకునేందుకు రాహుల్‌కు 30 రోజుల సమయం ఇచ్చింది. రాహుల్ అభ్యర్థనపై వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ సైతం మంజురు చేసింది.

రాహుల్ గాంధీ 2019‌లో అమేథీతో పాటు వయనాడ్‌కు పోటీ చేశారు. అమేథీలో ఓటమి చవిచూశారు. వయనాడ్‌లో గెలుపొందారు. ప్రస్తుతం పరువునష్టం కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో సూరత్ కోర్టు తీర్పును సెషన్స్ కోర్టులో రాహుల్ సవాలు చేయనున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పైకోర్టు స్టే ఇవ్వకుంటే 8 ఏళ్ల పాటు పోటీ చేసే ఛాన్స్ లేనట్టే.

Updated Date - 2023-03-25T16:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising