Bharat Jodo Yatra: రాహుల్‌తో కలిసి నడిచిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్
ABN, First Publish Date - 2023-01-08T20:01:51+05:30
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హర్యానా..
చండీగఢ్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ప్రస్తుతం హర్యానా (Haryana)లో కొనసాగుతోంది. ఆదివారంనాడు ఈ యాత్రలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ (Ex-army chief Gen Kapoor), పలువురు వెటరన్లు పాల్గొన్నారు. రాహుల్ గాంధీకో కలిసి వీరంతా ఉత్సాహంగా నడిచారు. ఈనెలాఖరుకు చివరి మజిలీగా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పర్యటించడం ద్వారా యాత్ర ముగుస్తుంది.
హర్యానాలో ఆర్మీ మాజీ చీఫ్ దీపక్ కుమార్, తదితరులు భారత్ జోడా యాత్రలో పాల్గొన్న ఫోటోను కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ''ఆర్మీ మాచీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్‌కే హూడ, లెఫ్టినెంట్ జనరల్ వీకే నరుల, ఏఎం పీఎస్ భాంగు, మేజర్ జనరల్ సత్బీర్ సింగ్ చౌదరి, మేజనర్ జనరల్ ధర్మేందర్ సింగ్, కల్నల్ జితేందర్ గిల్, కల్నల్ పుష్పేందర్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ డీడీఎస్ సంధు, మేజర్ జనరల్ బిషంబెర్ దయాల్, కల్నల్ రోహిత్ చౌదరి సహా పలువురు ఆర్మీ మాజీ అధికారులు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు'' అని ఆ ట్వీట్‌లో మాణిక్యం ఠాగూర్ తెలిపారు.
Updated Date - 2023-01-08T20:01:55+05:30 IST