ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Exit Polls: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్

ABN, First Publish Date - 2023-02-27T19:40:40+05:30

త్రిపుర మళ్లీ బీజేపీదే అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది.

Exit Polls shows BJP To Win Big In Tripura
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: త్రిపుర (Tripura), మేఘాలయ (Meghalaya), నాగాలాండ్ (Nagaland) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో వివిధ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) వెల్లడించాయి. త్రిపుర మళ్లీ బీజేపీ(BJP)దే అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే తెలిపింది. దీని ప్రకారం 45 శాతం ఓటింగ్‌తో త్రిపుర బీజేపీ మరోసారి అధికారంలోకి రానుంది. 60 స్థానాలున్న త్రిపుర శాసనసభలో బీజేపీకి 36 నుంచి 45 స్థానాలు లభిస్తాయని, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడించింది. వామపక్షాలకు 6 నుంచి 11 స్థానాలు, టీఎంసీ 9 నుంచి 16 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. త్రిపురలో మోథా పార్టీ 20 శాతం ఓటింగ్ సాధించనుందని ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. త్రిపురలో ఈనెల 16న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. 28.14 లక్షల మంది ఓటర్లలో 24.66 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మేఘాలయ ఎగ్జిట్ పోల్స్..

మేఘాలయ (Meghalaya) అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా ఎన్‌పీపీ (NPP) 18-24 సీట్లలో, కాంగ్రెస్ (Congress) 6-12 స్థానాల్లో, బీజేపీ 4-8 చోట్ల, ఇతరులు 4-8 నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చునని ఇండియా-టుడే ఎగ్జిట్ పోల్స్ (India today Exit polls) అంచనా వేసింది.

ఇక నాగాలాండ్‌లో మొత్తం 60 సీట్లు ఉండగా.. ఎన్‌డీపీపీ అలయెన్స్ 38-48 స్థానాల్లో, ఎన్‌పీఎఫ్ 3 -8 సీట్లలో, కాంగ్రెస్ 1-2 చోట్ల, ఇతరులు 5-15 నియోజకరవర్గాల్లో గెలుపు సాధించవచ్చునని పేర్కొంది.

ఇవి కేవలం ఎగ్జిట్ ఫలితాలు మాత్రమే. వాస్తవ ఫలితాలు మార్చ్ రెండున విడుదల అవుతాయి.

ఇతర ఎగ్జిట్ పోల్స్...

త్రిపుర..

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా - బీజేపీ అలయెన్స్ 36-45 సీట్లు, లెఫ్ట్ 6-11 సీట్లు, టీఎంపీ 9-11 సీట్లు, ఇతరులు 0.

టౌమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ - బీజేపీ అలయెన్స్ 21-27 సీట్లు, కాంగ్రెస్ 0, లెఫ్ట్ 18-24 సీట్లు.

జీ న్యూస్-మ్యాట్రైజ్ - బీజేపీ అలయెన్స్ 29-36 సీట్లు, కాంగ్రెస్- సున్నా, లెఫ్ట్ 13-21 సీట్లు.

మేఘాలయ..

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా - ఎన్‌పీపీ 18-24 సీట్లు, కాంగ్రెస్ 6-12 సీట్లు, బీజేపీ 4-8 సీట్లు, ఇతరులు 4-8 సీట్లు.

- టైమ్స్ నౌ-ఈటీజీ రీసెర్చ్ - బీజేపీ 3-6 సీట్లు, కాంగ్రెస్ 2-5 సీట్లు, ఎన్‌పీపీ 18-26.

- జీ న్యూస్-మ్యాట్రైజ్ - బీజేపీ 6-11 సీట్లు, కాంగ్రెస్ 3-6 సీట్లు, ఎన్‌పీపీ 21-26 సీట్లు.

నాగాలాండ్..

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా - ఎన్‌డీపీపీ+ 38-48 సీట్లు, ఎన్‌పీఎఫ్ 3-8 సీట్లు, కాంగ్రెస్ 1-2 సీట్లు, ఇతరులు 5-15 సీట్లు.

టౌమ్స్ నౌ - ఈటీజీ రీసెర్చ్ - బీజేపీ+ఎన్‌డీపీపీకి 39-49 సీట్లు, కాంగ్రెస్ -0 , ఎన్‌పీఎఫ్ 4-8 సీట్లు.

జీ న్యూస్-మ్యాట్రైజ్ - బీజేపీ+ఎన్‌డీపీపీ 35-43 సీట్లు, కాంగ్రెస్ 1 -3 సీట్లు, ఎన్‌పీఎఫ్ 2-5 సీట్లు.

Updated Date - 2023-02-27T20:28:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising