Varanasi : దళితుని ఇంట్లో అల్పాహారం స్వీకరించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
ABN, First Publish Date - 2023-06-11T15:02:58+05:30
విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ఆదివారం ఓ దళితుని ఇంట్లో అల్పాహారం స్వీకరించారు.
వారణాసి : విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) ఆదివారం ఓ దళితుని ఇంట్లో అల్పాహారం స్వీకరించారు. జీ20 డెవలప్‌మెంట్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన శనివారం ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి వచ్చారు. ఈ సమావేశాలు జూన్ 11 నుంచి 13 వరకు జరుగుతాయి.
బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్త సుజాత కుమారి మాట్లాడుతూ, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ వంటి అగ్ర నేత తమ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు తమ కుటుంబ సభ్యులంతా కలిసి, తమ ఇంటిని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు శనివారం నుంచి కృషి చేస్తున్నామని చెప్పారు. ఆయన గౌరవార్థం అనేక సంప్రదాయ వంటకాలను తయారు చేశామని చెప్పారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం వారణాసికి చేరుకున్నారు. ఆయనకు కాశీ రీజియన్ బీజేపీ అధికార ప్రతినిధి నవరతన్ రాఠీ, ఆ పార్టీ సీనియర్ నేతలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. సుజాత ఇంట్లో అల్పాహారం స్వీకరించిన తర్వాత జైశంకర్ బీజేపీ కాశీ రీజియన్ నిర్వహించిన సెమినార్‌లో పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, మేధావులకు మన దేశ విదేశాంగ విధానంపై అవగాహన పెంచడం కోసం ఈ సెమినార్‌ను నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత దేశం పటిష్ట స్థితిలో ఉండటంలో ఈ విధానం పోషిస్తున్న పాత్రను వివరించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వైద్యులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులు హాజరయ్యారు.
జైశంకర్ మాట్లాడుతూ, వారణాసి వంటి సాంస్కృతిక ప్రాధాన్యంగల నగరాల్లో జీ20 సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. జీ20 వేదిక ద్వారా విదేశీ ప్రతినిధులకు భారత దేశ వైవిద్ధ్యభరిత సంస్కృతిని చూపించడం చాలా ముఖ్యమని చెప్పారు. మన సంస్కృతి గురించి వారికి చెప్పడం వల్ల వారు దానిని అర్థం చేసుకుని, దానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతారని చెప్పారు. గడచిన తొమ్మిదేళ్ల నుంచి మన దేశంలో మంచి మార్పులు వస్తున్నాయని చెప్పారు. మానవుడి కేంద్రంగా ఈ మార్పులు జరుగుతున్నాయన్నారు. జాతీయతాభావం, టెక్నలాజికల్ అడ్వాన్స్‌మెంట్స్, టీమిండియా సహకారాత్మక కృషి వల్ల ఈ పరివర్తన జరుగుతోందన్నారు.
ఇవి కూడా చదవండి :
Wrestlers : ఆధారాలివ్వండి : ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు
Congress : కాంగ్రెస్‌కు అంతు చిక్కని సచిన్ పైలట్ వ్యవహారం
Updated Date - 2023-06-11T15:02:58+05:30 IST