ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Former CM: 26న ఢిల్లీకి మాజీ సీఎం.. అక్కడ ఎవరితో భేటీ కానున్నారంటే..

ABN, First Publish Date - 2023-04-23T08:17:30+05:30

ఈనెల 26వ తేదీన మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి ఢిల్లీ వెళుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై): అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి(Former Chief Minister Edappadi K. Palaniswami) ఈనెల 26న ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, తాజాగా ఆ పదవికి కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారం తెలిపిన నేపథ్యంలో తొలిసారి ఆయన ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ కావాలని భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా ఆయన తన ఢిల్లీ టూర్‌ షెడ్యూల్‌ను ఖరారు చేస్తున్నారు. ఇంతకు మునుపు ఆయన ఢిల్లీ వెళ్ళినపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలతో భేటీ కాలేదు. ఆ ఇరువురూ అప్పాయింట్‌మెంట్‌ కేటాయించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ దఫా మాత్రం ఆయన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీకి తొలిసారి వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన ఖచ్చితంగా హోంమంత్రి అమిత్‌షా(Home Minister Amit Shah)తో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలు గురించి సమగ్రంగా చర్చించాలన్న ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా, వచ్చే యేడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే - బీజేపీ కూటమి సీట్ల పంపిణీ తదితర అంశాలపై చర్చించాలని భావిస్తున్నారు.

అదేసమయంలో వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు వేర్వేరుగా అభ్యర్థులను బరిలో దించుతున్నాయి. ఈ అంశాన్ని కూడా అమిత్‌షా దృష్టికి ఈపీఎస్‌ తీసుకెళ్ళాలని భావిస్తున్నారు. అదేవిధంగా కర్ణాకటలో బీజేపీ అధికార పార్టీగా ఉంది. దీంతో ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఈపీఎస్‌ అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. దీంతో బీజేపీ - అన్నాడీఎంకే(BJP - AIADMK) అభ్యర్థుల ముఖాముఖి పోటీ నెలకొననుంది. ఈ విషయాన్ని కూడా అమిత్‌షా దృష్టికి తీసుకెళ్ళి.. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలన్న ఆలోచనలో ఈపీఎస్‌ ఉన్నారు. అందువల్ల ఈ దఫా మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఢిల్లీ పర్యటన ఎంతో కీలకంకానుంది. అలాగే, ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీకి వచ్చే ఎడప్పాడికి ఘనస్వాగతం పలికేలా అన్నాడీఎంకే నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సీనియర్‌ నేత తంబిదురై వంటి వారు ప్రత్యేక దృష్టిసారించారు. అలాగే, ఎడప్పాడి వెంట పలువురు సీనియర్‌ నేతలు కూడా హస్తినకు వెళ్లనున్నారని ఆ పార్టీ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి.

Updated Date - 2023-04-23T08:17:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising