ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka : రాజకీయాల కన్నా ప్రజల ఆకాంక్షలే ముఖ్యం : బసవరాజ్ బొమ్మయ్

ABN, First Publish Date - 2023-05-17T13:32:51+05:30

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలస్యం చేస్తుండటంపై మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ తీవ్రంగా స్పందించారు.

Basavaraj Bommai
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలస్యం చేస్తుండటంపై మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల కన్నా ప్రజల ఆకాంక్షలే చాలా ముఖ్యమైనవని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని కోరారు. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.

బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు మెజారిటీ లభించినప్పటికీ, ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పటికీ ఖరారు చేయలేదన్నారు. ఇది ఆ పార్టీలో అంతర్గత పరిస్థితులను తేటతెల్లం చేస్తోందన్నారు. రాజకీయాల కన్నా ప్రజల ఆకాంక్షలే చాలా ముఖ్యమైనవని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని కోరారు.

ఇదిలావుండగా, కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి పేరుపై నాలుగు రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠతకు తెరపడబోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) బుధవారం సాయంత్రం అధికారికంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.

ఈ పదవి కోసం పోటీ పడుతున్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌తో కాంగ్రెస్ పెద్దలు బుధవారం కూడా మంతనాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు. అధికారికంగా సిద్ధరామయ్య పేరును ఖర్గే ప్రకటించిన తర్వాత సిద్ధరామయ్య గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

డీకేపై కేసులే అడ్డంకి

డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నప్పటికీ, ఆయనపై సీబీఐ, ఈడీ కేసులు ఉండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఆయనకు వేరొక కీలక పదవిని ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని ఇస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయించే అవకాశం ఉందని, అప్పుడు కాంగ్రెస్‌ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

అనుభవానికే పెద్ద పీట

మరోవైపు సిద్ధరామయ్య గతంలో ముఖ్యమంత్రిగా పని చేయడంతోపాటు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు కూడా ఆయనకే ఉండటంతో ఆయనవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సామాన్య ప్రజల్లో ఆయనకు ఆకర్షణ ఉండటం కూడా ఆయనకు ప్లస్ పాయింట్ అయినట్లు చెప్తున్నారు.

డీకే అసంతృప్తి?

సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో డీకే శివ కుమార్ మంత్రిగా బాధ్యతలను నిర్వహించాలని చెప్పడాన్ని శివ కుమార్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి డీకే కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే సోనియా గాంధీ ఆయనకు నచ్చజెప్పేందుకు ఫోన్ ద్వారా మాట్లాడినట్లు సమాచారం. రెండేళ్ల వరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధిష్ఠానం డీకే శివ కుమార్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :

Gujarat CM : గుజరాత్ ముఖ్యమంత్రి నిరాడంబరత.. ఇలాంటి నేత కదా కావాలి..

India Vs EU : రష్యన్ చమురు రీసెల్లింగ్.. యూరోపియన్ దౌత్యవేత్తకు ఘాటు జవాబిచ్చిన జైశంకర్..

Updated Date - 2023-05-17T13:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising