ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uddhav Thackeray: గోద్రా లాంటి ఘటన జరగొచ్చు! మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-12T02:30:10+05:30

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ‘గోద్రా’ లాంటి ఘటన జరిగే అవకాశం ఉందన్నారు.

అయోధ్యలో రామ మందిరం

ప్రారంభం తర్వాత జరిగే చాన్స్‌

ఉద్ధవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబై, సెప్టెంబరు 11: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ‘గోద్రా’ లాంటి ఘటన జరిగే అవకాశం ఉందన్నారు. రామాలయం పేరిట బీజేపీ ఈ కుట్ర చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. మహారాష్ట్రలోని జలగావ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉద్ధవ్‌ మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి బస్సులు, రైళ్లలో లక్షలాదిగా జనం తరలివస్తారన్నారు. అక్కడి నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఏదో ఒక చోట గోద్రా లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎక్కడో ఒక చోట దాడి జరగొచ్చని, బస్సులు తగలబెట్టడం, రాళ్లు రువ్వడం, మారణకాండ వంటివి జరుగుతాయని అన్నారు. దేశవ్యాప్తంగా అల్లర్లు చోటుచేసుకుంటాయని, వాటిని బీజేపీ రాజకీయాలకు వాడుకుంటుందని ఆరోపించారు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్‌లోని గోద్రా స్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు నిప్పంటించడంతో 58 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కాగా, ఉద్ధవ్‌ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. కొందరు వ్యక్తులు అధికార దాహంతో వారి సిద్ధాంతాలను మర్చిపోయారని విమర్శించారు. అధికారం కోసం పాకులాడుతూ ఉద్ధవ్‌ చేస్తున్న పనులను చూసి.. బాలాసాహెబ్‌ (శివసేన వ్యవస్థాపకుడు, ఉద్ధవ్‌ తండ్రి) ఉండి ఉంటే ఈ రోజు ఏం చేసేవారో తనకు తెలియడం లేదని చెప్పారు. కాగా, సనాతన ధర్మాన్ని అవమానించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అనురాగ్‌ అన్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్‌ నేత రాహుల్‌, శివసేన నేత ఉద్ధవ్‌ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి వ్యాఖ్యానించడం, తర్వాత అదే పార్టీకి చెందిన మరో నేత ఎ.రాజా సనాతన ధర్మాన్ని ఎయిడ్స్‌, కుష్ఠుతో పోల్చడం తెలిసిందే.

ఇండియా సమన్వయ సమితి

మొదటి సమావేశం రేపు

న్యూఢిల్లీ: బీజేపీని గద్దె దించేందుకు దేశంలోని 28 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి స్థాపించిన ఇండియా సమన్వయ సమితి మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలోని శరద్‌ పవార్‌ ఇంట్లో జరగనుంది. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి అవలంబించాల్సిన కార్యాచరణ గురించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు రాష్ట్రీయ జనతాదళ్‌ ఎంపీ మనోజ్‌ ఝా తెలిపారు. రేపటి సమావేశానికి నాయకత్వం ఎవరు వహిస్తారని విలేకరులు మనోజ్‌ఝాను ప్రశ్నించగా.. ప్రజలకు మెరుగైన ప్రత్యామ్నాయం కోసమే తాము ఇండియాగా ఏర్పడ్డామని, తమ కూటమిలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు అందరూ సమానమేనని ఆయన చెప్పారు.

బీజేపీ విషసర్పం

బీజేపీ ఓ విష సర్పమని, ఆ విషసర్పానికి చెత్తకుప్పలాంటి అన్నాడీఎంకే ఆశ్రయమిస్తోందని తమిళనాడు మంత్రి ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అన్నాడీఎంకే పాములకు ఆశ్రమిచ్చే పార్టీగా మారిపోయింది. చెత్తకుప్ప నుంచే పాము మన ఇంట్లోకి చొరబడుతుంది. పాము ఇంట్లోకి రాకుండా ఉండాలంటే.. మన ఇంటి చుట్టుపక్కల చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. తమిళనాడు మన ఇల్లు. బీజేపీ ఓ విష సర్పం. అన్నాడీఎంకే మన ఇంటి చుట్టుపక్కలుండే చెత్త. మనం ఆ చెత్తను తీసేసే వరకు విషసర్పం తొలగిపోదు. అందుకే సర్పంలాంటి బీజేపీ నుంచి విముక్తి పొందాలంటే దానికి ఆశ్రమిస్తున్న అన్నాడీఎంకేను కూడా తొలగించాల్సిందే’’ అంటూ ఉదయనిధి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-09-12T11:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising