Former Minister Sri Ramulu: మాజీమంత్రి శ్రీరాములు ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-09-07T12:44:39+05:30
కాంగ్రెస్ పార్టీ కారణంగా కర్ణాటక రాష్ట్రం అంధకారంలో మునిగిపోయిందని మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sri Ramulu)
బళ్లారి(బెంగళూరు): కాంగ్రెస్ పార్టీ కారణంగా కర్ణాటక రాష్ట్రం అంధకారంలో మునిగిపోయిందని మాజీ మంత్రి శ్రీరాములు(Former Minister Sri Ramulu) అన్నారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రోజూ 18వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని, కానీ ఉత్పత్తి పడిపోయిందన్నారు. బీజాపూర్, రాయచూర్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు మూతపడాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో లోడ్ షెడ్డింగ్, గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత విద్యుత్తుతో చీకట్లు కమ్ముకున్నాయని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీరాములు మండిపడ్డారు. ఉచిత హామీల పథకం ద్వారా అధికారం పొందిన వారికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, ప్రజలకు, పశువులకు తాగునీరు కూడా దొరకడం లేదన్నారు. పంటలు ఎండిపోతున్నాయని, 42మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ పథకానికి డబ్బులు ఇవ్వడం మానేసిందని, ఇందుకోసం రైతు సంఘాలు పోరాడాలన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం పొందుతున్న బొగ్గు బకాయిలు చెల్లించకపోవడంతో బొగ్గు సరఫరాలో వైవిధ్యం నెలకొందన్నారు. విలేకరుల సమావేశంలో విధానసభ సభ్యుడు వై,ఎం.సతీశ్, నగర మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర రైతు మోర్చా ప్రధాన కార్యదర్శి ఎస్. గురలింగనగౌడ, పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ మహిపాల్, జిల్లాధ్యక్షుడు గోనాల్ మురహర్‌గౌడ, నాయకులు మదిరె కుమారస్వామి తదితరులున్నారు.
Updated Date - 2023-09-07T12:44:40+05:30 IST