Modi Leadership : ‘రష్యా, ఉక్రెయిన్ మెడలు వంచే సత్తా మోదీకే ఉంది’
ABN, First Publish Date - 2023-01-21T15:03:50+05:30
గత ఏడాది ఫిబ్రవరి నుంచి యుద్ధం చేసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ కలిసి కూర్చుని, చర్చించుకునేలా చేయగలిగే సత్తా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ : గత ఏడాది ఫిబ్రవరి నుంచి యుద్ధం చేసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ కలిసి కూర్చుని, చర్చించుకునేలా చేయగలిగే సత్తా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి ఉందని ఫ్రెంచ్ వెటరన్ జర్నలిస్ట్ లారా హయిమ్ (Laura Haim) అన్నారు. ఎవరో ఒకరు ఆ పని చేయవలసిన అవసరం ఉందన్నారు. మోదీ ఈ విషయంలో కీలక పాత్ర పోషించగలరని చెప్పారు. లారా హయిమ్ ప్రస్తుతం ఎల్‌సీఐ న్యూస్ చానల్ (LCI news channel)లో పని చేస్తున్నారు.
ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ఎవరో ఒకరు ముందుకు రావలసిన అవసరం ఉందని లారా హయిమ్ అన్నారు. ఈ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించగలరని చెప్పారు. అయితే చర్చలు జరగాలని ఉక్రెయిన్ కోరుకోవడం లేదని, అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై తీర్పు చెప్పాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుకుంటున్నారని, అందువల్ల ఇది అత్యంత సంక్లిష్ట సమస్య అని తెలిపారు. శాంతి ప్రక్రియలో భారత దేశం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొంత వరకు కృషి చేయాలని అన్నారు. ఇరు దేశాలను చర్చలకు తీసుకురాగలిగేవారి అవసరం ఉందని చెప్పారు. హత్యలకు కారణం మీరు అంటే మీరు అని ఒకరిపై మరొకరు నిందలు మోపుకుంటున్న ప్రస్తుత సమయంలో ఆ దేశాలు చర్చించుకునేలా చేయడం చాలా కష్టమని తెలిపారు. టర్కీకి చాలా ముఖ్యమైన స్థానం ఉందని తెలిపారు. అమెరికా పెద్దలు మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రన్ (Emmanuel Macron) ఎన్నికల ప్రచారంలో అంతర్జాతీయ వ్యవహారాల విభాగం అధికార ప్రతినిధిగా లారా హయిమ్ పని చేశారు.
Updated Date - 2023-01-21T15:03:54+05:30 IST