ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Summit security : 1,30,000 మంది సిబ్బంది, బుల్లెట్-ప్రూఫ్ కార్లు..

ABN, First Publish Date - 2023-09-03T11:38:04+05:30

ఇరవై దేశాల అధినేతలు పాల్గొనే జీ20 సదస్సుకు భద్రతా ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశాల కోసం 1,30,000 మంది భద్రతా సిబ్బంది, బుల్లెట్-ప్రూఫ్ కార్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ సేవలందించబోతున్నాయి.

Security Personnel Rehearsal

న్యూఢిల్లీ : ఇరవై దేశాల అధినేతలు పాల్గొనే జీ20 సదస్సుకు భద్రతా ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశాల కోసం 1,30,000 మంది భద్రతా సిబ్బంది, బుల్లెట్-ప్రూఫ్ కార్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ సేవలందించబోతున్నాయి. ప్రపంచ వేదికపై భారత దేశానికి పెరుగుతున్న ప్రాధాన్యానికి తగినట్లుగా ఈ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి.

దేశ రాజధాని నగరంలో మొత్తం 1,30,000 మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వీరిలో 80 వేల మంది ఢిల్లీ పోలీసులు కూడా ఉన్నారు. ఢిల్లీ పోలీసులు, కేంద్ర భద్రతా దళాలకు చెందిన 45 వేల మంది సిబ్బంది భారత దేశంలో పోలీసులు ధరించే ఖాకీ దుస్తులకు బదులుగా నీలి రంగు దుస్తులు ధరిస్తారు. ఈ 45 వేల మందిలో కొందరు కమాండోలు కూడా ఉంటారు. ఈ కమాండోలు హెలికాప్టర్ల నుంచి తాడు ద్వారా క్రిందకు అత్యంత వేగంగా దిగగలిగే సామర్థ్యంగలవారు. కార్లను చాలా కచ్చితత్వంతో నడపగలిగే నైపుణ్యంగలవారు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా విధులు నిర్వహిస్తారు. అతిథులను సురక్షితంగా కాపాడుతూ, భద్రత కల్పించవలసిన విధి భారత దేశానికి ఉంది.


గగనతల రక్షణ కోసం..

ఢిల్లీ, దాని పరిసరాల్లో గగనతల రక్షణకు భారత వాయు సేన సమగ్ర చర్యలు చేపట్టింది. గగనతలం గుండా ఎదురయ్యే ముప్పులను సమగ్రంగా తిప్పికొట్టేందుకు యాంటీ-డ్రోన్ సిస్టమ్స్‌ను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ దళాల సహకారంతో భారత సైన్యం ఏర్పాట్లు చేసింది. దాదాపు 400 మంది అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా అందుబాటులో ఉంటారు. దేశాధినేతలను తీసుకెళ్లి, తీసుకొచ్చేందుకు రూ.18 కోట్లతో 20 బుల్లెట్-ప్రూఫ్ కార్లను ప్రభుత్వం అద్దెకు తీసుకుంది.

కంట్రోల్ రూమ్స్..

న్యూఢిల్లీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించారు. అమెరికా నుంచి దాదాపు 20 విమానాలు రాబోతున్నట్లు ఓ అధికారి తెలిపారు. జీ20 సదస్సు జరిగే ప్రగతి మైదానంలో సెక్యూరిటీ కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఐటీసీ మౌర్య హోటల్‌లో బస చేస్తారు. ఆయనతోపాటు మిగిలిన దేశాల నేతలు బస చేసే హోటళ్ల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.

నేరగాళ్ల ప్రవేశం..

చిత్రాలు, ఆడియో సమాచారం ద్వారా దుండగులను గుర్తించేందుకు సీసీటీవీల్లో సాఫ్ట్‌వేర్‌ను అమర్చారు. గతంలో నేరాలు చేసినవారిని ఇవి గుర్తించి, సమాచారాన్ని పంపిస్తాయి. దీనిని ఉపయోగించుకుని న్యూఢిల్లీ నగరంలోకి నేరగాళ్లు ప్రవేశించకుండా నిరోధించవచ్చు.


జిన్‌పింగ్ డుమ్మా!

ఈ సదస్సులో పాల్గొనే ముఖ్య నేతల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్, సౌదీ అరేబియా నేత మహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టే అవకాశం ఉంది. అయితే జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీల నేతలు హాజరుకావచ్చు. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు బదులుగా ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ హాజరవుతారు. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల చీఫ్‌లు కూడా హాజరవుతారు.

ఇవి కూడా చదవండి :

DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్

Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిన బీజేపీ: రాహుల్

Updated Date - 2023-09-03T12:00:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising