బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లే వారికి గుడ్‌న్యూస్..!
ABN, First Publish Date - 2023-05-25T13:39:36+05:30
బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్లే వారికి ఓ గుడ్‌న్యూస్..! ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఈ నెల 28, 30 తేదీలలో విజయవాడ(Vijayawada) వైపు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఈ నెల 28, 30 తేదీలలో విజయవాడ(Vijayawada) వైపు ప్రత్యేక రైళ్ళను నడుపనున్నారు. సర్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్ నుంచి ఒక ప్రత్యేక రైలు 28న మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరి వెళుతుందని నైరుతి రైల్వేజోన్ పరిధిలో బెంగళూరు డివిజన్ ప్రకటించింది. సర్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్- హౌరా ఎక్స్‌ప్రెస్ (06569) రైలు కృష్ణరాజపురం, బంగారుపేట, జోలార్ పేట, కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం(Vijayawada, Rajahmundry, Duvvada, Kothavalasa, Vijayanagaram,), శ్రీకాకుళం, పలాస, భువనేశ్వర్, కటక్‌ల మీదుగా హౌరా చేరుకుంటుంది. విజయవాడకు ఈ రైలు మే 29 వేకువ జామున 2.20 గంటలకు చేరుకోనుంది. ఈ రైలులో ఒక ఏసీ త్రీటైర్ బోగీతో పాటు 14 స్లీపర్ బోగీలు, రెండు సెకండ్‌క్లాస్ బోగీలు ఉంటాయని ప్రకటన పేర్కొంది. కాగా బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్ (కెఎస్‌ఆర్) నుంచి దానాపూర్ వరకు 06567 నెంబరు రైలును ఈ నెల 30న నడుపనున్నారు. ఈ రైలు ఆ రోజు ఉదయం 6.50కు బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి కృష్ణరాజపురం జోలార్ పేట, కాట్పాడి, అరక్కోణం, పెరంబూరు, గూడూరు, విజయవాడ(Gudur, Vijayawada), వరంగల్, బలార్షా, నాగపూర్‌ల మీదుగా దానాపూర్ చేరుకోనుంది. ఈ రైలు విజయవాడకు అదే రోజు రాత్రి 9.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలుకు ఒక ఎసీ టూటైర్, ఒక ఎసీ త్రీ టైర్ బోగీలతో పాటు 15 స్లీపర్ కోచ్‌లు, 2 జనరల్ కోచ్‌లు ఉంటాయని ప్రకటన పేర్కొంది. విజయవాడ వైపు వెళ్ళే ప్రయాణీకులు ఈ రైళ్ళ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రకటనలో తెలిపారు.
Updated Date - 2023-05-25T13:40:12+05:30 IST