fire: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ మంటలు.. లోకో పైలెట్ నిర్ణయంతో తప్పిన పెనుప్రమాదం
ABN, First Publish Date - 2023-06-22T22:06:06+05:30
లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో (Lokmanya Tilak Express) ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. బేసిన్ బ్రిడ్జి సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు కోచ్‌ల్లో నుంచి భయంతో ప్రయాణీకులు కిందకు పరుగులు తీశారు.
చెన్నై: లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో (Lokmanya Tilak Express) ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. బేసిన్ బ్రిడ్జి సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు కోచ్‌ల్లో నుంచి భయంతో ప్రయాణీకులు కిందకు పరుగులు తీశారు. సాయంత్రం 6 గంటలకు చెన్నై నుంచి ముంబైకి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరింది.
సాయంత్రం 6.48 గంటలకు చెన్నై బేసిన్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే రైలు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హైఓల్టేజీ విద్యుత్ లైన్‌పై ఇంజిన్ రాపిడికి గురికావడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన లోకో పైలెట్ (loco pilot) వెంటనే రైలును ఆపి వేయడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Updated Date - 2023-06-22T22:08:32+05:30 IST