ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Opposition INDIA : ప్రతిపక్షాల కూటమి పేరుపై నితీశ్ కుమార్ తీవ్ర అభ్యంతరం?

ABN, First Publish Date - 2023-07-19T11:43:41+05:30

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమైన ప్రతిపక్షాలు తమ కూటమికి భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I.N.D.I.A) అని నామకరణం చేశాయి. అయితే ఈ పేరు పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకమైన ప్రతిపక్షాలు తమ కూటమికి భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (I.N.D.I.A) అని నామకరణం చేశాయి. అయితే ఈ పేరు పట్ల బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Bihar Chief Minister Nitish Kumar) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమ, మంగళవారాల్లో బెంగళూరులో జరిగిన సమావేశాలకు 26 ప్రతిపక్ష పార్టీలు హాజరైన సంగతి తెలిసిందే.

విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిపక్షాల కూటమికి ఇండియా అనే పేరును పెట్టడానికి ముందు భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ చర్చించలేదు. ఈ పేరును బయటపెట్టే సరికి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఓ కూటమికి ఇండియా అనే పేరును ఏ విధంగా పెడతారని ఆయన కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీల నేతలను ప్రశ్నించారు.

మరోవైపు ప్రతిపక్షాలను ఓ వేదికపైకి తీసుకురావడం కోసం నితీశ్ కుమార్ అహర్నిశలు శ్రమించగా, ఆయన కష్టానికి వచ్చిన ఫలితాన్ని కాంగ్రెస్ హైజాక్ చేసిందని జేడీయూ, ఆర్జేడీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఈ పరిణామాలను చూసి, దిగ్భ్రాంతికి గురవుతున్నారని తెలుస్తోంది.

జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA)ను రానున్న లోక్‌‌సభ ఎన్నికల్లో ఓడించే లక్ష్యంతో సోమ, మంగళవారాల్లో 26 పార్టీలు కలిసి I.N.D.I.Aగా ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ పేరుకు ‘జీతేగా భారత్’ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాల మొదటి సమావేశం పాట్నాలో గత నెలలో జరిగిన సంగతి తెలిసిందే.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రతిపక్షాల కూటమికి I.N.D.I.A అనే పేరును రాహుల్ గాంధీ, మమత బెనర్జీ సూచించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో నితీశ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతిపక్షాల కూటమికి ఇండియా అనే పేరును ఎలా పెడతామని ప్రశ్నించారు. ఈ పేరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో NDA అనే అక్షరాలు ఉన్నాయని, ఈ రెండు పేర్లూ ఒకే విధంగా కనిపిస్తున్నాయని చెప్పారు. అప్పుడు వేరొక నేత ఆయనతో మాట్లాడుతూ, ఎన్డీయేలో ‘ఐ’ ఉందని చెప్పారు. ఇండియా మెయిన్ ఫ్రంట్ లేదా ఇండియా మెయిన్ అలయెన్స్ అని ప్రతిపక్షాల కూటమికి పేరు పెట్టాలని నితీశ్ సూచించారు. వామపక్ష పార్టీల నేతలు కూడా I.N.D.I.A పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సేవ్ ఇండియా అలయెన్స్’ లేదా ‘వుయ్ ఫర్ ఇండియా’ అని పేరు పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో నితీశ్ I.N.D.I.A పేరుపై మౌనంగా అంగీకారం తెలిపారు. ‘మీరంతా సరేనంటే సరే, మంచిదే’ అని చెప్పారు.

I.N.D.I.A పేరులోని ‘డీ’ అనే అక్షరానికి డెమొక్రసీ అని చెప్పడంపై కూడా నేతల మధ్య చర్చ జరిగింది. అధికార కూటమి NDAలోని ‘డీ’ అనే అక్షరానికి కూడా డెమొక్రసీ అనే వివరణ ఇచ్చారని కొందరు నేతలు గుర్తు చేశారు. దీంతో I.N.D.I.A పేరులోని ‘డీ’ అనే అక్షరానికి డెమొక్రసీకి బదులుగా డెవలప్‌మెంటల్ అని మార్చాలని కాంగ్రెస్ సూచించింది. అలా అయితే I.N.D.I.A , ఎన్డీయే వేర్వేరుగా కనిపిస్తాయని చెప్పింది.

I.N.D.I.A పేరును మమత బెనర్జీ సూచించారని వీసీకే పార్టీ చీఫ్ థోల్ తిరుమవలవన్ చెప్పారు. ఎన్‌సీపీ నేత జితేంద్ర అవహద్ చెప్పిన వివరాల ప్రకారం ఈ పేరును రాహుల్ గాంధీ సూచించారు. ఆయన సృజనాత్మకతను అందరూ మెచ్చుకున్నారు. అన్ని పార్టీలు దీనికి అంగీకరించాయి. ఈ పేరును రాహుల్ గాంధీ సూచించినప్పటికీ, అధికారికంగా మమత బెనర్జీ చేత ప్రతిపాదింపజేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం మమత మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘మా ప్రియమైన రాహుల్ గాంధీ’’ అని సంబోధించారు.

ఇదిలావుండగా, I.N.D.I.A పేరుపై బీజేపీ విమర్శలు గుప్పించడంతో, ప్రతిపక్ష కూటమి ఈ పేరుకు ఓ ట్యాగ్‌లైన్‌ను తగిలించింది. I.N.D.I.A అని పెడుతూ, జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది) అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టింది. పేరుకు హిందీ ట్యాగ్‌లైన్ ఉండాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సూచించినట్లు తెలుస్తోంది.

ప్రతిపక్షాల తదుపరి సమావేశం ముంబైలో జరుగుతుంది. దీనికి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రచార కార్యకలాపాల నిర్వహణ కోసం ఢిల్లీలో సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి.

ఇవి కూడా చదవండి :

Covid Outbreat : కోవిడ్-19 వైరస్ ప్రారంభంపై అనుమానాలు.. వూహన్ ఇన్‌స్టిట్యూట్‌కు అమెరికా నిధుల నిలిపివేత..

Terror Plot : బెంగళూరులో భారీ ఉగ్ర దాడుల కుట్ర భగ్నం

Updated Date - 2023-07-19T11:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising