ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Sukhvindar Singh Sukhu: రూ.51 లక్షల సేవింగ్స్‌ని వరద బాధితులకు విరాళంగా ఇచ్చిన సీఎం

ABN, First Publish Date - 2023-09-15T19:53:14+05:30

భారీ వర్షాలు, వరదల(Floods)తో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) ని వ్యక్తిగతంగా ఆదుకోవడానికి సీఎం సుఖ్వీందర్ సింగ్(CM Sukhvindar Singh Sukhu) సుఖు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం తన జీవిత కాల సేవింగ్స్ ని వరద బాధితులకు సాయంగా అందించారు. శుక్రవారం రూ.51 లక్షల సేవింగ్ మనీని ఆయన భార్య కమలేష్ ఠాకూర్ తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనాకు సంబంధిత చెక్కును అందజేశారు.

భారీ వర్షాలు, వరదల(Floods)తో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) ని వ్యక్తిగతంగా ఆదుకోవడానికి సీఎం సుఖ్వీందర్ సింగ్(CM Sukhvindar Singh Sukhu) సుఖు తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం తన జీవిత కాల సేవింగ్స్ ని వరద బాధితులకు సాయంగా అందించారు. శుక్రవారం రూ.51 లక్షల సేవింగ్ మనీని ఆయన భార్య కమలేష్ ఠాకూర్ తో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనాకు సంబంధిత చెక్కును అందజేశారు. సీఎం మాట్లాడుతూ.. 'నా పర్సనల్ సేవింగ్స్ నుంచి ఇస్తున్న ఈ మనీ(Pocket Money) బాధితులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.


విపత్తు సహాయ నిధికి చిన్నారులు తమ దగ్గర దాచుకున్న సేవింగ్స్ ని సాయంగా ఇచ్చారు. ఆఫీసర్లు, ఎంప్లాయిస్, పింఛను తీసుకునే వృద్ధులు సైతం ఈ సాయంలో పాలుపంచుకున్నారు. అలాంటప్పుడు నేనేందుకు చేయకూడదు. అందుకే నా సేవింగ్స్ అన్నింటినీ ఇచ్చేస్తున్నా' అని అన్నారు. వరదల కారణంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్ లో బాధితులకు సాయం చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విన్నవించారు. అందుకు ఎంతో స్పందన రాగా.. తన వంతు సాయంగా ముఖ్యమంత్రి కూడా డబ్బులు ఇవ్వడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ(Congress) తన ఎక్స్(X) అకౌంట్ లో షేర్ చేసింది.

Updated Date - 2023-09-15T19:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising