Sharad Pawar: కొందరిని గుడ్డిగా నమ్మి తప్పుచేశా.. క్షమించండి..!
ABN, First Publish Date - 2023-07-08T21:10:25+05:30
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభానికి తాను ఎవరినీ తప్పుపట్టనని, ఇందుకు బాధ్యత తానే తీసుకుంటానని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన అంచనాలు తప్పాయని చెప్పారు. ఎన్‌సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు అనంతరం ప్రజల ముందు వాస్తవాలు వివరించేందుకు శరద్ పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శనివారంనాడు శ్రీకారం చుచ్టారు. వర్షంలో తడుస్తూనే నాసిక్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.
నాసిక్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో (NCP) తలెత్తిన సంక్షోభానికి తాను ఎవరినీ తప్పుపట్టనని, ఇందుకు బాధ్యత తానే తీసుకుంటానని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) అన్నారు. తన అంచనాలు తప్పాయని చెప్పారు. ఎన్‌సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు అనంతరం ప్రజల ముందు వాస్తవాలు వివరించేందుకు శరద్ పవార్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు శనివారంనాడు శ్రీకారం చుచ్టారు. వర్షంలో తడుస్తూనే నాసిక్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
''క్షమాపణలు చెప్పుకునేందుకే ఇక్కడకు వచ్చాను. కొందరు వ్యక్తులను గుడ్డిగా నమ్మి తప్పుచేశాను. మళ్లీ అలాంటి పొరపాట్లు చేయను'' అని శరద్ పవార్ ఆవేదనగా అన్నారు. తన వయసును ఎత్తిచూపుతూ మాట్లాడుతున్న వ్యక్తులు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారని పరోక్షంగా అజిత్ పవార్ వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన అన్నారు. మోదీ ఇటీవల మహారాష్ట్రలో జరిపిన పర్యటనలో ఎన్‌సీపీ నేతలను అవినీతిపరులని ఆరోపించారని, వారిపై చర్య తీసుకోవాలని తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.
నిజమైన ఎన్‌సీపీ తమదేనంటూ అజిత్ పవార్ క్లెయిమ్ చేయగా, దీనిని శరద్ పవార్ తిప్పికొట్టారు. ఇందుకు ప్రతిగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించారు. తొలి మజిలీగా నాసిక్‌లో సీనియర్ పవార్ ఆగారు. ఆయన రాకతో భావోద్వేగ వాతావరణం కనిపించింది. దానికి తోడు ఎడతెగని వర్షాల మధ్య నాసిక్ చేరుకున్న పవార్ తడిసి ముద్దయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన కుమార్తె సుప్రియా సూలే షేర్ చేశారు.
కాగా, మెజారిటీ ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని అజిత్ పవార్ చెబుతుండగా, అసలు ఎన్‌సీపీ చీలనే లేదని, అలాంటప్పుడు నెంబర్ గేమ్ అనే ప్రసక్తే లేదని ఆయన వర్గం నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేకు కీలక బాధ్యతలు అప్పగించడం వల్లే తిరుగుబాటు జరిగిందని ఆయన చెప్పారు. దీనిని శరద్ పవార్ తీవ్రంగా ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియ గెలిచారని, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రఫుల్ పటేల్‌కు రాజ్యసభ సీటు ఇచ్చామని ఆయన వివరించారు.
Updated Date - 2023-07-08T21:23:49+05:30 IST