ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs Canada: ఇతర దేశాల నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు.. జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-30T11:41:17+05:30

వాక్ స్వాతంత్ర్యం గురించి భారత్ ఇతర దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

వాక్ స్వాతంత్ర్యం గురించి భారత్ ఇతర దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. తీవ్రవాదం, హింస పట్ల కెనడా మెతక వైఖరి సమస్యగా మారిందని అన్నారు. "చూడండి. మాది ప్రజాస్వామ్య దేశం. వాక్ స్వాతంత్ర్యం అంటే ఏమిటో మేము ఇతరుల నుంచి నేర్చుకోవలసిన అవసరం లేదు. వాక్ స్వాతంత్ర్యం హింసను ప్రేరేపించడం వరకు విస్తరించిందని మేము అనుకోము. అది మన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుంది, కానీ స్వేచ్ఛ రక్షణను కాదు. వాక్ స్వాతంత్ర్యం హింసకు దారి తీయకూడదని మేము స్పష్టంగా చెబుతున్నాం" అని జైశంకర్ అన్నారు. భారత్‌, కెనడా దేశాలు పరస్పరం మాట్లాడుకోవాలని నిజ్జర్‌ మృతిపై ఉన్న విభేదాలను ఎలా పరిష్కరించుకోవాలో చూడాలని అన్నారు. భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్‌లతో చర్చించినట్లు ఆయన తెలిపారు.


అలాగే కెనడాలో అతివాదులు ఆశ్రయం పొందుతుండడం ఆందోళనకరమని మంత్రి జైశంకర్ అన్నారు. ఈ విషయాన్ని అమెరికా దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. అతివాదం కొంతకాలంగా నిద్రాణస్థితిలో ఉందన్న ఆయన.. కెనడా మెతక వైఖరి కారణంగా కొన్ని ఏళ్ల నుంచి మళ్లీ బుసులుకొడుతుందని చెప్పారు. స్థానిక రాజకీయాల కారణంగా కెనడా ప్రభుత్వం అతివాదుల కార్యకలాపాలకు అవకాశం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. అమెరికాకు కెనడా భిన్నమైన దేశంగా కనిపించొచ్చు అన్నారు. కానీ తమ వరకు చూస్తే వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం, ఏర్పాటువాదం, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా కలగలిసిన ఓ విషపూరిత మిశ్రమానికి కెనడా కేంద్రంగా మారిందని జైశంకర్ మండిపడ్డారు. కెనడాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు వెనకాడుతున్నారని ఆయన తెలిపారు. భారత దౌత్యవేత్తలు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండడంతో కెనడా పౌరులకు వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి జైశంకర్ తెలిపారు.

Updated Date - 2023-09-30T11:48:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising