IMD Heatwave Alert : ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు...ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరిక జారీ
ABN, First Publish Date - 2023-04-18T13:40:00+05:30
ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు....
ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్షియస్ కు చేరుకున్నాయి.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్షియస్ కు చేరుకున్నాయి. మండే ఎండలతోపాటు వారం రోజులపాటు పలు రాష్ట్రాల్లో(Several States) వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ మంగళవారం హెచ్చరించింది.(IMD Issues, Heatwave Alert)హీట్ వేవ్ పరిస్థితుల కారణంగా పశ్చిమ బెంగాల్, త్రిపుర ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను వారం రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు.గంగానది, పశ్చిమ బెంగాల్ బీహార్‌లో నాలుగు రోజుల పాటు వేడి తరంగాలు (India Sizzles At 40 Degrees Celsius)వీచవచ్చునని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 18,19 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో హీట్ వేవ్ పరిస్థితులు నెలకొంటాయని ఐఎండీ అంచనా వేసింది. సిక్కిం, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజుల్లో వేడిగాలులు వీచవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో వడ గాలులు వీచవచ్చు...
ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా బుధవారం వరకు వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలను శాస్త్రవేత్తలు జారీ చేశారు.రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలు,రాయలసీమ ప్రాంతంలో మంగళవారం 38 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో వడదెబ్బకు 11 మంది మృతి
మహారాష్ట్ర ఈవెంట్‌లో 11 మంది వడదెబ్బతో మరణించారు.ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.ఢిల్లీలో, హీట్ వేవ్ పరిస్థితులు వరుసగా రెండవ రోజు కొనసాగాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గరిష్ట ఉష్ణోగ్రత 40.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది, ఇది సాధారణం కంటే నాలుగు డిగ్రీలు ఎక్కువ. దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవడం ఇది వరుసగా మూడో రోజు.పంజాబ్, హర్యానాలలో కూడా వేడి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇది కూడా చదవండి : Ajit Pawar: ఎన్సీపీకి అజిత్ పవార్ బిగ్ షాక్...30మంది ఎమ్మెల్యేలతో బీజేపీ తీర్థం?
హర్యానాలో, హిస్సార్‌లో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వేడిగాలులు వ్యాపించాయి.రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.రాజస్థాన్‌లోని చురులో అత్యధికంగా 42.2 డిగ్రీల సెల్సియస్, బన్స్వారాలో 42.1 డిగ్రీలు, కరౌలీలో 41.4 డిగ్రీలు, అల్వార్‌లో 41.9 డిగ్రీలు, కోటాలో 41.2 డిగ్రీలు, పిలానీలో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Updated Date - 2023-04-18T13:40:00+05:30 IST