ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Army, Navy and Air Force : త్రివిధ దళాల అధిపతులను భయపెట్టిన సంఘటనలు!

ABN, First Publish Date - 2023-01-18T20:10:49+05:30

భారత దేశ త్రివిధ దళాల అధిపతులు తమ కెరీర్‌లో ఎదురైన అతి పెద్ద సవాళ్ళను ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా వివరించారు.

Army , Navy, Air Force chiefs
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశ త్రివిధ దళాల అధిపతులు తమ కెరీర్‌లో ఎదురైన అతి పెద్ద సవాళ్ళను ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా వివరించారు. ‘‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3’’ (India’s Most Fearless 3) పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి (Air Chief Marshal VR Chaudhari), నావికా దళాధిపతి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ (Admiral R Hari Kumar), సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే (Gen Manoj Pande) మాట్లాడారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ ఈ పుస్తకాన్ని రచించారు. మన దేశ సైనికుల ధైర్యసాహసాలను వివరించే వాస్తవ కథలతో దీనిని రచించారు.

ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి మాట్లాడుతూ, యూనిఫాం ధరించిన స్త్రీ, పురుషులకు ప్రతి రోజూ సవాలుతో కూడుకున్నదేనని చెప్పారు. భయపెట్టే సంఘటనలు అందరి కెరీర్‌లోనూ జరుగుతాయన్నారు. బయటి ఉష్ణోగ్రత మైనస్ 53 డిగ్రీలు ఉన్నపుడు, 12.3 కిలోమీటర్ల ఎత్తులో మిగ్-29 (MiG-29) విమానంలో కెనపీ లేకుండా, శబ్ద వేగానికి సుమారు రెండు రెట్ల వేగంతో అంటే మాచ్ 1.9 (Mach 1.9) వేగంతో ప్రయాణించడం తన అనుభవంలో చాలా సవాలుతో కూడుకున్న సంక్లిష్ట సంఘటన అని చెప్పారు. మిగ్-29 విమానంతో ఎయిర్ టెస్ట్ చేస్తున్నపుడు కెనపీ ఎగిరిపోయిందన్నారు. అంత వేగం, ఎత్తులో అకస్మాత్తుగా గాలి బరువు వల్ల ఒత్తిడి తగ్గిపోతుందని, ఆ హఠాత్పరిణామంలో స్పృహతో, సమర్థవంతంగా పని చేయగలిగిన సమయం కేవలం 6 సెకండ్లు మాత్రమేనని చెప్పారు. ఆ తక్కువ సమయంలోనే ఓ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. తాను తన విమానాన్ని డైవ్‌ చేశానని, అప్పటికే గంటకు 1,700 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నానని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా క్రిందకు దిగిపోవాలనే ఆలోచన వచ్చిందన్నారు. గాలి దెబ్బ నుంచి తప్పించుకోవడానికి తాను ముడుచుకుని ఉన్నానని చెప్పారు. చివరికి విమానాన్ని క్రిందకు దించేశానని తెలిపారు.

అడ్మిరల్ హరి కుమార్ మాట్లాడుతూ, విన్యాసాలు జరుగుతున్నపుడు తాను కమాండ్ చేస్తున్న విమాన వాహక నౌక నుంచి యుద్ధ విమానాలు తిరిగి వచ్చే సరికి వాటి సామర్థ్య పరిమితి దాదాపు పూర్తి కావచ్చిందని, అప్పుడు ఒళ్లు గగుర్పొడిచిందని చెప్పారు. అవి తిరిగి విమాన వాహక నౌకలోకి చేరేసరికి వాటి ట్యాంకుల్లో ఇంధనం కొంచెమైనా లేదన్నారు.

సైన్యాధిపతి జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ, గౌరవం, విధేయత, గుర్తింపు అనే అంశాలు సైనికులను ప్రేరేపిస్తాయని, వాటి నుంచి వారు స్ఫూర్తి పొందుతారని చెప్పారు. వారు తమ విధి నిర్వహణలో గొప్ప త్యాగాలు, ప్రాణ త్యాగాలు చేయడానికి ప్రేరేపించే అంశాలు ఇవేనని తెలిపారు. మృత్యువునైనా ఎదుర్కొనే పరిస్థితుల్లోకి వెళ్లేందుకు ఇవి ప్రేరేపిస్తాయన్నారు. అనేక సంవత్సరాల శిక్షణ ద్వారా ఈ వైఖరి అభివృద్ధి చెందుతుందన్నారు. ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ 3’ పుస్తకంలో పేర్కొన్న హీరోల కథల ద్వారా స్ఫూర్తిని పొందుతారని చెప్పారు.

Updated Date - 2023-01-18T20:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising