ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmir : ఉగ్రవాదులు వాడుతున్న మొబైల్ యాప్‌లపై నిషేధం

ABN, First Publish Date - 2023-05-01T11:06:43+05:30

జమ్మూ-కశ్మీరులోని ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ నుంచి సమాచారం పంపించడానికి ఉపయోగపడుతున్న 14 మెసెంజర్ మొబైల్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

Mobile Apps
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులోని ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ నుంచి సమాచారం పంపించడానికి ఉపయోగపడుతున్న 14 మెసెంజర్ మొబైల్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నిషేధానికి గురైన యాప్‌లలో Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, Element, Second line, Zangi, Threema ఉన్నాయి. ఈ యాప్‌లను పాకిస్థాన్, జమ్మూ-కశ్మీరులలో ఉన్న ఉగ్రవాదులు వాడుతున్నట్లు నిర్థరణ కావడంతో భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది.

దేశ భద్రతకు ప్రమాదకరంగా మారిన మొబైల్ యాప్‌లను భారత ప్రభుత్వం గతంలో కూడా నిషేధించింది. దేశ రక్షణ, ప్రజా భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతలకు విఘాతం కలిగిస్తున్న అనేక చైనీస్ యాప్‌లను గతంలో నిషేధించింది. మొత్తం మీద సుమారు 250 చైనీస్ యాప్‌లను నిషేధించింది. నిషేధానికి గురైన చైనీస్ యాప్‌లలో టిక్‌టాక్, షేర్ఇట్, వుయ్‌చాట్, హెలో, లైకీ, యూసీ న్యూస్, బిగో లైవ్, యూసీ బ్రౌజర్, జెండర్, కామ్‌స్కానర్ వంటివి ఉన్నాయి. అదేవిధంగా పబ్జీ మొబైల్ గేమ్స్ వంటివాటిపై నిషేధం విధించింది.

ఇవి కూడా చదవండి :

రైతు సమస్యలపై దేశవ్యాప్త పోరాటం: ఎస్కేఎం

LPG cylinder prices : భారీగా తగ్గిన వంటగ్యాస్ ధరలు

Updated Date - 2023-05-01T11:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising