ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indore temple: కూలిన ఆలయం ఘటనలో 35కు చేరిన మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2023-03-31T08:22:49+05:30

ఇండోర్ నగరంలోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి పైకప్పు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 35కు పెరిగింది...

Beleshwar Mahadev Jhulelal
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇండోర్ (మధ్యప్రదేశ్): ఇండోర్ నగరంలోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి పైకప్పు కూలిన దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 35కు పెరిగింది.(Indore temple floor cave in) శ్రీరామనవమి సందర్భంగా బాలేశ్వర్ ఆలయంలో భక్తులు పూజలు చేస్తుండగా బావి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 35 మంది మృతదేహాలను(Toll mounts to 35) బావి నుంచి వెలికి తీశారు. ఈ దుర్ఘటనలో మరో 18మందిని రక్షించారు.(rescue survivors) గాయపడిన 16 మందికి చిత్స అందిస్తున్నామని ఇండోర్ డివిజన్ పోలీసు కమిషనర్ పవన్ శర్మ చెప్పారు.

ఇది కూడా చదవండి : Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హుష్ మనీ కేసు

బావిలో మృతదేహాల కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. 75 మంది ఆర్మీ సిబ్బందితో సహా 140 మంది బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటోంది.ప్రధాని నరేంద్ర మోదీ కూడా పరిస్థితిని పరిశీలించి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇండోర్‌లో జరిగిన దుర్ఘటన చాలా బాధ కలిగించిందని మోదీ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇది కూడా చదవండి : Pakistan:పాక్‌లో దారుణం... గోథుమపిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట...ఐదుగురి మృతి

బావిపై ఆలయ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారో కూడా కనుగొనాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన ప్రకటించారు.ఇండోర్‌ ఆలయంలో జరిగిన దుర్ఘటనపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-31T08:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising