ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NCP split: మరో చీలిక దిశగా పవార్ ఎన్‌సీపీ..?

ABN, First Publish Date - 2023-08-06T15:48:03+05:30

మహారాష్ట్ర దిగ్గజ నేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరో చీలిక దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోసారి తిరుగుబాటు తప్పకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఈసారి ఎన్‌సీపీ నేత జయంత్ పాటిల్ ఎన్‌సీపీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు.

ముంబై: మహారాష్ట్ర దిగ్గజ నేత శరద్ పవార్ (Sharad Pawar) సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP) మరో చీలిక దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోసారి తిరుగుబాటు (Revolt) తప్పకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఈసారి ఎన్‌సీపీ నేత జయంత్ పాటిల్ (Jayant Patil) ఎన్‌సీపీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షాను ఆదివారం ఉదయం జయంత్ పాటిల్ కలుసుకోవడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అమిత్‌షా, జయంత్ పాటిల్ మధ్య ఒక ఒప్పందంపై చర్చలు జరిగినట్టు అనుమానిస్తున్నారు. శరద్ పవార్ క్యాంపును విడిచిపెట్టి మహారాష్ట్ర ప్రభుత్వం (NDA)లో చేరేందుకు జయంత్ పాటిల్‌తో మరో సీనియర్ నేత రాజేష్ తోపే కూడా కలిసినట్టు తెలుస్తోంది.


రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సాంగ్లి నుంచి తనకు ఎంపీ టిక్కెట్, తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్టు ఇవ్వాలని పాటిల్ కోరుతున్నారని, అన్నీ సజావుగా జరిగితే పాటిల్, రాజేష్ తోపేలు ఈ నెలలోనే ఎన్డీయే ప్రభుత్వంలో చేరవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్‌సీపీలో కీలక నేత అయిన అజిత్ పవార్ గత జూలై 2న ఎన్డీయే ప్రభుత్వంలో చేరడం ద్వారా శరద్ పవార్‌కు షాక్ ఇచ్చారు. అజిత్‌కు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఆయన వర్గం 8 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలకు క్యాబినెట్ పదవులు దక్కాయి.


వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో బీజేపీ కేంద్ర అధిష్ఠానం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మహారాష్ట్రంలోని పుణె, బారామతి, శిరూర్, మావల్ లోక్‌సభ సీట్లను లక్ష్యంగా చేసుకుని పుణె జిల్లా నేతలతో అమిత్‌షా ఇటీవల సమావేశమయ్యారు.

Updated Date - 2023-08-06T16:39:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising