ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kamal Haasan: అసలు విషయం చెప్పేసిన విశ్వనటుడు కమల్‏హాసన్‌.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

ABN, First Publish Date - 2023-11-08T10:43:34+05:30

రాజకీయాలకు అతీతంగా మానవత్వం తమను కలిపిందని, అందువల్ల డీఎంకేతో తమ బంధం అతీతమైనదని

- డీఎంకేతో నా చెలిమి రాజకీయాలకు అతీతం

- పొత్తుపై త్వరలో నిర్ణయం

- విశ్వనటుడు కమల్‌ హాసన్‌

అడయార్‌(చెన్నై): రాజకీయాలకు అతీతంగా మానవత్వం తమను కలిపిందని, అందువల్ల డీఎంకేతో తమ బంధం అతీతమైనదని విశ్వ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌(Kamal Haasan) అన్నారు. కమల్‌ తన 69వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఎగ్మోర్‌లోని ప్రభుత్వ చిన్నపిల్లల ఆస్పత్రిలో గాలిలోని తేమ నుంచి తాగునీటిని తయారు చేసే ఆర్‌వో ప్లాంట్‌ను కమల్‌ కల్చరల్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా దాన్ని కమల్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పీకే శేఖర్‌బాబు, ఎం.సుబ్రమణ్యంతో పాటు ఎంఎన్‌ఎం నేతలు, కమల్‌ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌ విలేకరులతో మాట్లాడుతూ... తామంతా మనుషులమని, తమను మానవత్వమే ఒక్కటిగా చేర్చిందన్నారు. తమ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ కార్యాలయంలో రెండేళ్లుగా ఈ తరహా యంత్రంలో తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. కలుషితం లేని తాగునీటిని ప్రజలు పొందేందుకు ఈ తరహా యంత్రాలు దోహదపడుతాయని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... తమ బంధం రాజకీయాలకు అతీతమైనదన్నారు. ప్రతి ఒక్కరికీ వారివారి సొంత పార్టీలు ఉన్నాయనీ, వారంతా తమతమ పార్టీలకు విశ్వాసపాత్రులుగా ఉన్నారన్నారు. అయితే, మానవత్వమే అత్యంత ప్రధానమన్నారు. ఈ మానవత్వమే తమ అందరినీ ఒక్కటి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా రాజకీయాలకు అతీతంగా ఇక్కడకు వచ్చారని కమల్‌ హాసన్‌ అన్నారు.

శుభాకాంక్షల వెల్లువ

కమల్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin)తో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కమల్‌ హాసన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం తన ట్విటర్‌ ఖాతాలో విషెస్‌ తెలుపుతూ ట్వీట్‌ చేశారు. చలన చిత్రపరిశ్రమంలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న కళాకారుడు, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌ హాసన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు జీవించాలి’ అని పేర్కొన్నారు. అలాగే, పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌, కాంగ్రెస్‌ నేతలు, వీసీకే ప్రధాన కార్యదర్శి తిరుమా, అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు, ఈపీఎస్‌, ఓపీఎస్‌, అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సహా పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా సినీ రంగానికి చెందిన దిగ్గజ దర్శకుడు ఎస్‌ శంకర్‌ ఓ ట్వీట్‌ చేస్తూ, ‘కమల్‌ హాసన్‌ సర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. సేనాధిపతిని మళ్లీ వెండితెరపైకి తీసుకొచ్చేందుకు మీతో కలిసి ప్రయాణించే అద్భుతమైన అవకాశం కలిగింది. మిలియన్ల మందికి స్ఫూర్తిగా ఉంటారని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు. ఇదిలావుండగా కమల్‌ హాసన్‌ తన బర్త్‌డే పార్టీని సోమవారం రాత్రి నగరంలోని ఒక నక్షత్రహోటల్‌లో జరుపుకున్నారు. ఇందులో ఏవీఎం శరవణన్‌తో పాటు అనేక మంది సినీ నటీనటులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ముంబై నుంచి బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ ప్రత్యేకంగా చెన్నైకు రావడం గమనార్హం.

ఎంఎన్‌ఎం ఆధ్వర్యంలో..

ఎంఎన్‌ఎం ఆధ్వర్యంలో వివిధ రకాలైన కార్యక్రమాలను నిర్వహించారు. కమల్‌ హాసన్‌ అభిమానులు, ఎంఎన్‌ఎం నేతలు, కార్యకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి, అన్నదానాలు చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లుపాలు అందించారు. పలు చోట్ల సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు.

Updated Date - 2023-11-08T10:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising