ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress Vs BJP : ముస్లింలను కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తోంది : కర్ణాటక సీఎం

ABN, First Publish Date - 2023-05-04T11:30:27+05:30

కర్ణాటకలో ముస్లింలను తప్పుదోవపట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మయ్

Basavaraj Bommai
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్ణాటకలో ముస్లింలను తప్పుదోవపట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మయ్ (Basavaraj Bommai) ఆరోపించారు. తమ ప్రభుత్వం ముస్లింలకు భద్రత కల్పించిందని చెప్పారు. నిరుపేద ముస్లింలలో 17 ఉప కులాలు ఉన్నాయన్నారు. వాటిని తాము తొలగించలేదని చెప్పారు. ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్లను బసవరాజ్ బొమ్మయ్ ప్రభుత్వం మార్చిలో రద్దు చేసింది. వీరశైవ లింగాయత్‌, వొక్కళిగలకు చెరొక 2 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ముస్లింలకు ఆర్థిక బలహీన వర్గాల కోటా క్రింద రిజర్వేషన్లు ఇచ్చింది. దీనిపై ముస్లింలను తప్పుదోవపట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని బొమ్మయ్ ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లకు ఎటువంటి ప్రాతిపదిక లేదన్నారు. దీనికి సంబంధించిన డేటా బేస్ కానీ, చట్టబద్ధత కానీ లేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటువంటి ప్రయత్నం జరిగిందని, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిని నిలిపేసిందని చెప్పారు. తాము ముస్లింలకు భద్రతను కల్పించామని చెప్పారు. నిరుపేద ముస్లింలలో 17 ఉప కులాలు ఉన్నాయని చెప్పారు. తాము వాటిని తొలగించలేదన్నారు. ఆ ఉప కులాలు జాబితాలో ఉన్నాయని చెప్పారు. విధానాన్ని మార్చలేదని తెలిపారు. నిజానికి నాలుగు శాతానికి బదులుగా వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. ముస్లింలు సంతోషంగానే ఉన్నారని, వారిని కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తోందని చెప్పారు. ముస్లింలకు బీజేపీ ప్రభుత్వం రక్షణ కల్పించిందని ఓ ప్రముఖ దిన పత్రికలో రాశారని తెలిపారు. తమిళనాడు వంటి రాష్ట్రాలు కూడా తమను అనుసరించాలని చెప్పారు.

ఇదిలావుండగా, వీరశైవ లింగాయత్‌లు, వొక్కళిగలు కర్ణాటక జనాభాలో 40 శాతం వరకు ఉంటారు. వీరి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకుని, వీరికి రిజర్వేషన్లు ఇచ్చామని బొమ్మయ్ ప్రభుత్వం చెప్తోంది. ముస్లిం కోటాను రద్దు చేస్తూ బొమ్మయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు విమర్శించింది. హిందూ కులాలకు ఆ రిజర్వేషన్లను కట్టబెట్టడాన్ని కూడా విమర్శించింది.

హెచ్‌డీ దేవె గౌడ ప్రభుత్వం 1994లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కల్పించింది. బసవరాజ్ బొమ్మయ్ ప్రభుత్వం 2023 మార్చి 26న తీసుకున్న నిర్ణయంతో వొక్కళిగలకు రిజర్వేషన్లు 4 శాతం నుంచి 6 శాతానికి, వీరశైవ లింగాయత్‌లకు రిజర్వేషన్లు 5 శాతం నుంచి 7 శాతానికి పెరిగాయి.

ఆర్థిక బలహీన వర్గాల కేటగిరీలో ప్రస్తుతం బ్రాహ్మణులు, జైనులు, ఆర్యవైశ్యులు, నాగర్తలు, మొదలియార్లు ఉన్నారు. వీరు రాష్ట్ర జనాభాలో 4 శాతం వరకు ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర జనాభాలో 13 శాతం ఉన్న ముస్లింలు ఈ కోటాలోకి ప్రవేశించారు.

ఇవి కూడా చదవండి :

Atiq Ahmed Murder : అతిక్ సోదరుల హత్యతో వెలుగు చూసిన మరో దారుణం.. కారును ఓవర్‌టేక్ చేసిన వ్యక్తిని చంపేసిన గ్యాంగ్‌స్టర్..

Wrestlers: మద్యం తాగిన పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు...కన్నీటిపర్యంతమైన మహిళా రెజ్లర్లు

Updated Date - 2023-05-04T11:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising