ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra-karnataka Water dispute: మా వాటా జలాలు ఇమ్మంటూ షిండేకు సిద్ధరామయ్య లేఖ

ABN, First Publish Date - 2023-05-31T17:06:11+05:30

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరనా/కొయినా రిజర్వాయర్ నుంచి కృష్ణా నదికి 2.00 టీఎంసీల జలాలు, ఉజ్జయిని రిజర్వాయర్ నుచి భీమా నదికి 3.00 టీఎంసీల నీటిని వదలాల్సిందిగా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్ షిండేకు బుధవారంనాడు ఒక లేఖ రాశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ వివాదం (Maharashtra-Karnataka Water dispute) మరోసారి తెరపైకి వచ్చింది. వరనా/కొయినా రిజర్వాయర్ నుంచి కృష్ణా నదికి 2.00 టీఎంసీల జలాలు, ఉజ్జయిని రిజర్వాయర్ నుచి భీమా నదికి 3.00 టీఎంసీల నీటిని వదలాల్సిందిగా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌ నాథ్ షిండే(Eknath Shinde)కు బుధవారంనాడు ఒక లేఖ రాశారు. ఉత్తర కర్ణాటకలోని ప్రజలు, పశువుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు తక్షణం ఈ జలాలను విడుదల చేయాలని సిద్ధరామయ్య ఆ లేఖలో కోరారు.

దశాబ్దాలుగా వివాదం

కర్ణాటకకు మహారాష్ట్రతోనే కాకుండా పొరుగున ఉన్న తమిళనాడుతోనూ జలవివాదాలు ఉన్నాయి. కావేరీ జలాల అంశం తమిళనాడు, కర్ణాటక మధ్య ఉండగా, కృష్ణ జలాల షేరింగ్ వివాదంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉన్నాయి. చిరకాలంగా ఉన్న ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం, సుప్రీంకోర్టు, హైకోర్టులు, కేంద్ర జలవనరుల కమిషన్, కావేరీ రివర్ మేనేజిమెంట్ అధారిటీ (సీఆర్ఎంఏ), కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ (సీడబ్ల్యూఆర్‌సీ) ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. ఇది చాలా క్లిష్టమైన అంశం కావడంతో పాటు భాగస్వామ్య రాష్ట్రాల్లోని లక్షలాది మంది రైతులపై ప్రభావం సైతం ఉంటుంది.

అమిత్‌షా జోక్యం..

గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చొరవ తీసుకుని, నదీ జలాల పంపిణీకి సంబంధించి సంయుక్త పరిష్కారాన్ని దక్షిణాది రాష్ట్రాలు కనుగొనాలని కోరారు. తిరువనంతపురంలో జరిగిన 30వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లును ఉద్దేశించి అమిత్‌షా ఈ సూచన చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కోరారు. ఈ సమావేశంలో మొత్తం 26 అంశాలపై చర్చ జరగగా, 9 అంశాలు పరిష్కారమయ్యాయి. 17 అంశాలపై మరోసారి చర్చించేందుకు నిశ్చయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ రీఆర్గనైజేషన్‌కు సంబంధించిన 9 అంశాలున్నట్టు సమావేశానంతరం విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.

Updated Date - 2023-05-31T17:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising