ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sanatana Dharmam : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-07T16:46:01+05:30

సనాతన ధర్మంపై దాడి తీవ్రమవుతోంది. తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత డీఎంకే నేత ఏ రాజా మాట్లాడుతూ, సనాతన ధర్మం కుష్టు రోగం, ఎయిడ్స్‌ వంటిదని చెప్పారు.

Siddaramaiah,

బెంగళూరు : సనాతన ధర్మంపై దాడి తీవ్రమవుతోంది. తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత డీఎంకే నేత ఏ రాజా మాట్లాడుతూ, సనాతన ధర్మం కుష్టు రోగం, ఎయిడ్స్‌ వంటిదని చెప్పారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య రంగంలోకి దిగారు.

సాంఘిక సంస్కర్త నారాయణ గురు 169వ జయంత్యుత్సవాల కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ, ‘‘ఒకసారి నేను కేరళలో ఓ గుడికి వెళ్లాను. చొక్కా విప్పేసి, గుడిలోకి రావాలని అక్కడివాళ్లు నాకు చెప్పారు. నేను ఆ గుడిలోకి వెళ్లడానికి తిరస్కరించాను. నేను బయటే ఉండి ప్రార్థన చేస్తానని చెప్పాను. అక్కడ ఉన్నవారందరినీ చొక్కాలు విప్పేయమని వారు అడగలేదు. కేవలం కొద్ది మందికి మాత్రమే చొక్కాలు విప్పాలని చెప్పారు. ఇది అమానుష ఆచారం. దేవుని ముందు అందరూ సమానమే’’ అని చెప్పారు.

ఇదిలావుండగా, చాలా దేవాలయాల్లో భక్తులు కేవలం పంచె, కండువాలు మాత్రమే ధరించి భగవంతుని దర్శించుకునే ఆచారం ఉంది. సంప్రదాయ వస్త్రాలు ధరించి భగవంతుని దర్శించుకోవాలని నిబంధనలు ఉంటాయి.


ఇవి కూడా చదవండి :

Hello! UPI : డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారా? అయితే మీకు ఓ శుభవార్త!

Eradicate Sanatana Dharmam : మోదీపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం

Updated Date - 2023-09-07T16:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising