ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: యడియూరప్ప నివాసంలో బీజేపీ నేతల కీలక మంతనాలు

ABN, First Publish Date - 2023-05-12T18:42:51+05:30

బెంగళూరు: మరి కొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగనుండగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప నివాసంలో బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మంత్రులు మురుగేష్ నిరాని, బి.బసవరాజ్, పార్టీ ఎంపీ లెహర్ సింగ్ సిరోర, ఏటీ రామస్వామి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: మరి కొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగనుండగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) నివాసంలో బీజేపీ (BJP) కీలక నేతలు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మంత్రులు మురుగేష్ నిరాని, బి.బసవరాజ్, పార్టీ ఎంపీ లెహర్ సింగ్ సిరోర, ఏటీ రామస్వామి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈనెల 10న 224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా-నేనా అనేలా ఫలితాలు ఉంటాయని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. బీజేపీ కంటే కాంగ్రెస్ ఒకింత ముందంజలో ఉంటుందని తెలిపాయి. హంగ్ అసెంబ్లీకి అవకాశాలు ఉన్నాయని తేల్చిచెప్పాయి.

హంగ్ ప్రస్తక్తే లేదు...

కాగా, ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోకి వస్తుందని, కూటమి ప్రభుత్వం, హంగ్ అసెంబ్లీ ప్రసక్తి ఉండదని సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. సీఎం ఎవరనేది లెజిస్లేచర్ పార్టీ నిర్ణయిస్తుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం

కాగా, కర్ణాటకలోని 36 కేంద్రాల్లో ఉదయం శనివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2023-05-12T18:42:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising