ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Results: కర్ణాటకలో బొక్కబోర్లా పడిన బీజేపీ మంత్రులు.. మరీ ఇంత దారుణంగా ఓడిపోయారేంటో..!

ABN, First Publish Date - 2023-05-13T15:33:10+05:30

కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితా లు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి. ప్రజలు కాంగ్రెస్‌కు ఎదురు లేని మద్దతు ఇవ్వడంతో బీజేపీ పెద్దలు కలవరపడుతున్నారు.

BJP
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చాయి. ప్రజలు కాంగ్రెస్‌కు ఎదురు లేని మద్దతు ఇవ్వడంతో బీజేపీ పెద్దలు కలవరపడుతున్నారు. బీజేపీ మంత్రులు బీసీ పాటిల్, గోవింద కరజోల, డాక్టర్ కే సుధాకర్, ఎంటీబీ నాగరాజు, బీ శ్రీరాములు, నారాయణ గౌడ, మురుగేశ్ నిరానీ ఓటమిపాలవడంతో, రానున్న లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని ఇప్పటి నుంచే అంచనాలు కడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం మొత్తం 13 మంది మంత్రులు ఓడిపోయారు. బీజేపీ 62 స్థానాల్లో విజయం సాధించి, నాలుగింట్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. కాంగ్రెస్ 126 స్థానాల్లో గెలిచి, ఎనిమిదింట్లో ఆధిక్యంలో ఉంది. జేడీఎస్ 17 స్థానాల్లో విజయం సాధించి, మూడింట్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నలుగురు గెలిచారు.

ఇదిలావుండగా, ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికర సంఘటనలు జరిగాయి. కనకపుర నియోజకవర్గంలో కేపీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ కేవలం ఒక రోజు మాత్రమే ప్రచారం చేసి, లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలిచి, సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన మిగిలిన రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేసి, వారి విజయానికి బాటలుపరచి మరో ఘనతను దక్కించుకున్నారు.

జేడీఎస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఈ ఎన్నికల్లో గెలిచినప్పటికీ, ఆయన కుమారుడు నిఖిల్ కుమార స్వామి పరాజయంపాలయ్యారు. నిఖిల్ తల్లి అనిత కుమార స్వామి చేసిన త్యాగం వృథా అయింది. ఆమె రామ నగర స్థానాన్ని వదులుకుని నిఖిల్‌కు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆయనపై సుమలత గెలిచారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం దక్కించుకున్నారు. దీంతో నిఖిల్‌కు ఓటమి కొత్త కాదని ఆయన ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) హర్షం వ్యక్తం చేశారు. భారీ విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కేంద్రం, రాష్ట్రాల్లో ఇవే ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు

ఇవి కూడా చదవండి :

JDS KumaraSwamy: కుమారస్వామి గెలిచారు కానీ కొడుకును గెలిపించుకోలేకపోయారు.. అమ్మ త్యాగం వృధా..!

DK Shivakumar: భావోద్వేగంతో కంటతడి పెట్టిన డీకే

Updated Date - 2023-05-13T18:13:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising