ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Disqualification: సీఎంకు హైకోర్టు నోటీసు

ABN, First Publish Date - 2023-07-28T19:05:25+05:30

ఎన్నికల్లో తప్పుడు విధానాలను అనుసరించారనే ఆరోపణలకు సంబంధించిన పిటిషన్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని జస్టిస్ సునీల్ దత్ యాదవ్ ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు.

బెంగళూరు: ఎన్నికల్లో తప్పుడు విధానాలను అనుసరించారనే (Malpractice) ఆరోపణలకు సంబంధించిన పిటిషన్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah)కు ఆ రాష్ట్ర హైకోర్టు శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా తమ నోటీసుకు సమాధానం ఇవ్వాలని జస్టిస్ సునీల్ దత్ యాదవ్ ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు.


వరుణ (Varuna) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్యను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ అదే నియోజకవర్గానికి చెందిన కేఎం శంకర అనే వ్యక్తి పిటిషన్ వేశారు. సిద్ధరామయ్య ఎన్నికల సమయంలో అవినీతి విధానాలకు పాల్పడ్డారని ఆయన అభియోగంగా ఉంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు గ్యారెంటీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇది కరప్ట్ ప్రాక్టీస్ కిందకు వస్తుందని, ఇది లంచమివ్వడంతో సమానమని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(2)ను ఉల్లంఘించడమవుతుందని పిటిషనర్ వాదించారు. సిద్ధరామయ్య ఎన్నికల సమయంలో అవినీతి విధానాలకు పాల్పడినట్టు ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు గత మేలో జరుగగా, కాంగ్రెస్ మెజారిటీ సీట్లు దక్కించుకుని అధికార బీజేపీని గద్దెదింపింది. వరుణ నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య గెలిచారు.

Updated Date - 2023-07-28T19:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising