Karnataka Syllabus row: మోదీ, అమిత్‌షాకు గడ్కరి అంటే గిట్టదు.. కాంగ్రెస్ కౌంటర్..!
ABN, First Publish Date - 2023-06-18T16:15:47+05:30
కర్ణాటక సిలబస్ నుంచి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కెబి హెడ్గెవార్, హిందుత్వవాది వీడీ సావర్కర్ పాఠ్యాంశాలను తొలగించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గడ్కరిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఇష్టపడరని, ఆ కారణంగానే ఆయన ఆర్ఎస్ఎస్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటారని పేర్కొంది.
బెంగళూరు: కర్ణాటక సిలబస్ (Karnataka Syllabus) నుంచి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కెబి హెడ్గెవార్ (KB Hedgewar), హిందుత్వవాది వీడీ సావర్కర్ (VD Savarkar) పాఠ్యాంశాలను తొలగించడంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ (Congress) కౌంటర్ ఇచ్చింది. గడ్కరిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా ఇష్టపడరని, ఆ కారణంగానే ఆయన ఆర్ఎస్ఎస్‌ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తుంటారని పేర్కొంది. మహాత్మాగాంధీని చంపిన వ్యక్తి గురించి కాకుండా, గాంధీజీ సిద్ధాంతాలను విద్యార్థులకు బోధించాలని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుందని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ అన్నారు.
దేశంలోని విద్యార్థులు, కర్ణాటక విద్యార్థులు హెడ్గేవార్, సావర్కర్ సిద్ధాంతాలకు కాకుండా బీఆర్ అంబేద్కర్, జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ సిద్ధాతాలు అధ్యయనం చేయాలని వల్లభ్ అన్నారు. సావర్కర్, హెడ్గెవార్ సిద్ధాంతాలు దేశ ఐడియాలజీ కాదనే విషయం గడ్కరీకి కూడా తెలుసునని అన్నారు.
గడ్కరి ఏమన్నారు?
కర్ణాటక ప్రభుత్వం ఆరు నుంచి పదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాల్లోని హెడ్గెవార్, సావర్కర్ చిత్రను తొలగించడం దురదృష్టకరమని నాగపూర్‌లో సావర్కర్‌పై పుస్తకం విడుదల సందర్భంగా గడ్కరి వ్యాఖ్యానించారు. సావర్కర్, వివేకానందం ప్రచారం చేసిన భారతీయ, హిందూ సంస్కృతి ఒకటేనన్నారు. సావర్కర్, ఆయన కుటుంబం చేసిన త్యాగాల గురించి యువతరానికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
Updated Date - 2023-06-18T16:17:15+05:30 IST