Krishna Janmabhoomi Case: షాహి ఆద్గా సర్వే అనుమతిపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
ABN, Publish Date - Dec 15 , 2023 | 02:51 PM
ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహి ఈద్గాలో ప్రాథమిక సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. షాహి ఈద్గా సర్వే కోసం కమిషన్‌ను నియమిస్తూ ఇచ్చిన ఆదేశంపై తాము స్టే ఇవ్వాలని అనుకోవడం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
మధుర: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి (Srik Krishna Janmabhoomi) ఆనుకుని ఉన్న షాహి ఈద్గాలో ప్రాథమిక సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారంనాడు నిరాకరించింది. షాహి ఈద్గా సర్వే కోసం కమిషన్‌ను నియమిస్తూ ఇచ్చిన ఆదేశంపై తాము స్టే ఇవ్వాలని అనుకోవడం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సర్వే విధివిధానాలపై డిసెంబర్ 18న అలహాబాద్ హైకోర్టు విచారణ జరుపుతున్నందున ఆ విచారణ జరగనీయండని, ఏదైనా ప్రతికూల ఉత్తర్వు వచ్చినట్లయితే అప్పుడే తమను అప్రోచ్ కావచ్చని తెలిపింది.
ఈ అంశంపై హిందువుల తరఫు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మీడియాతో మాట్లాడుతూ, అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందని చెప్పారు. దీంతో హైకోర్టు ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని చెప్పారు.
Updated Date - Dec 15 , 2023 | 02:51 PM