ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gehlot 5 Guarantees: పాత పెన్షన్ స్కీమ్, కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్..

ABN, First Publish Date - 2023-10-27T17:15:13+05:30

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ శుక్రవారంనాడు ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఐదు హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించేందుకు చట్టం చేస్తామని ప్రకటించారు.

జైపూర్: రాజస్థాన్ (Rajasthan) అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు ఐదు గ్యారెంటీలను (Five Guarantees) కాంగ్రెస్ సీనియర్ నేత, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) శుక్రవారంనాడు ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఐదు హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. పాత పెన్షన్ పథకాన్ని (OPS) పునరుద్ధరించేందుకు చట్టం చేస్తామని, ఆవుపేడను కేజీ రూ.2కు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. కాలేజీ విద్యార్థులకు ల్యాప్‌టాప్ కానీ, టాబ్ కానీ ఇస్తామని, ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.15 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఒక కోటి మంది మహిళలకు మూడేళ్ల ఉచిత ఇంటర్నెట్ సర్వీసుతో స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని ప్రకటించారు.


ఎన్నికల హామీలను అమలు చేయడంలో తమ ప్రభుత్వానికి ట్రాక్ రికార్డ్ ఉందని, పార్టీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రైతు రుణాలను మాఫీ చేస్తామని తమ పార్టీ సీనియర్ నేత రాహల్ గాంధీ ఇచ్చిన హామీనినెరవేరుస్తామని గెహ్లాట్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సిన్హా నివాసాలపై ఈడీ దాడులను ప్రస్తావిస్తూ, కేంద్ర ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.

Updated Date - 2023-10-27T17:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising