ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు మృతి

ABN, First Publish Date - 2023-09-11T12:30:47+05:30

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న మినీ బస్సును వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీ కొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు.

చెన్నై: తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న మినీ బస్సును వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీ కొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు. 19 మందితో కూడిన మినీ బస్సు ధర్మశాల నుంచి తిరిగి వస్తుండగా టైర్ పంక్చర్ అయింది. 19 మందిలో 15 మంది మహిళలే ఉన్నారు. టైర్ పంక్చర్ కావడంతో పలువురు మహిళలు బస్సు నుంచి దిగారు. బస్సు ముందున్న డివైడర్‌పై కూర్చుకున్నారు. ఈ క్రమంలో మినీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ముందు కూర్చున్న మహిళలపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు పంక్చర్ వేసే అతడిని వెతకడం కోసం వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చనిపోయిన మహిళలను మీనా, సెట్టు, దైవనై, దేవకి, కళానిధి, సావిత్రి, గీతాంజలిగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని తిరుపత్తూరు జిల్లా కలెక్టర్ భాస్కర పాండియన్ ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. మృతి చెందిన మహిళల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇక ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఆరా తీశారు. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.

Updated Date - 2023-09-11T12:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising