ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya Pradesh : బ్రిటిష్ కాలంనాటి సంపదను పోలీసులకు అప్పగించిన దినసరి కూలీ

ABN, First Publish Date - 2023-04-21T16:55:59+05:30

మధ్య ప్రదేశ్‌కు చెందిన దినసరి కూలీ హల్లె అహిర్వార్ ఓ ఇంటి ఆవరణలో తవ్వినపుడు బ్రిటిష్ కాలంనాటి వెండి నాణేలు కనిపించడంతో అవాక్కయ్యారు.

Madhya Pradesh , Silver Coins
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ : మధ్య ప్రదేశ్‌కు చెందిన దినసరి కూలీ హల్లె అహిర్వార్ ఓ ఇంటి ఆవరణలో తవ్వినపుడు బ్రిటిష్ కాలంనాటి వెండి నాణేలు కనిపించడంతో అవాక్కయ్యారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి, తానే దాచుకోవాలని అనుకున్నారు. ఓ రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. ఆ తర్వాత ఇవి వేరొకరికి చెందినవి కాబట్టి, వాటిని ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించుకుని, పోలీసులకు అందజేశారు.

మధ్య ప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బదల్‌పుర గ్రామవాసి హల్లె అహిర్వార్ ఓ పాత ఇంటి వద్ద తవ్వినపుడు 1887వ సంవత్సరంనాటి వెండి నాణేలు 240 దొరికాయి. వీటిని చూసిన హల్లె కళ్లు బైర్లు కమ్మాయి. వీటిని తన వద్దనే ఉంచుకోవాలని మొదట భావించినప్పటికీ, రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించి, వాటిని పోలీసులకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ వెండి నాణేల విలువ సుమారు రూ.1.92 లక్షలు ఉండవచ్చునని తెలుస్తోంది.

కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి విజయ్ రాజ్‌పుట్ మాట్లాడుతూ, హల్లె అహిర్వార్ వెండి నాణేలను తమకు అప్పగించినట్లు తెలిపారు. ఇవి దొరికిన స్థలాన్ని పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదిలావుండగా, ఆ ఇంటి యజమాని మీనాక్షి ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, తమ పాత ఇంటిని తొలగించి, కొత్తగా నిర్మించుకుంటున్నామని తెలిపారు. తమ ఇంటి వద్ద దొరికిన వెండి నాణేలను హల్లె తన ఇంటికి తీసుకునిపోయారని, తమకు చెప్పలేదని, తాము సామాజిక మాధ్యమాల్లో చూసి, ఈ విషయాన్ని తెలుసుకున్నామని చెప్పారు.

ఇదిలావుండగా, ఈ స్థలంలో నిర్మాణ పనులను నిలిపేయాలని అధికారులు ఆదేశించారు. ఈ స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఆర్కియాలజీ, మినరల్స్ శాఖల అధికారులను పిలిచారు. ఈ ఇంటి ఆవరణలోనే ఓ గుడి కూడా ఉండటంతో ఇక్కడ మరింత సంపద ఉండే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

NCERT : పదో తరగతి సిలబస్‌లో కొన్ని భాగాల తొలగింపుపై శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ఆగ్రహం

Coca Cola Company : 35 ఎకరాల భూమిని కేరళ ప్రభుత్వానికి అప్పగించనున్న కోకా-కోలా కంపెనీ

Updated Date - 2023-04-21T16:55:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising