ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra: అన్నదాతకు ఏటా రూ.12,000.. షిండే సర్కార్ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2023-05-30T19:45:40+05:30

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఒక కొత్త ఆర్థిక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని కోటి మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.6,000 చెల్లిస్తుంది. ఇంతే మొత్తంలో మరో రూ.6,000 కేంద్ర అందించాలని నిర్ణయించింది. దీంతో మహారాష్ట్ర రైతులు ఏటా రూ.12,000 పొందుతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఒక కొత్త ఆర్థిక పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని కోటి మంది రైతులకు (Farmers) రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.6,000 చెల్లిస్తుంది. ఇంతే మొత్తంలో మరో రూ.6,000 కేంద్ర అందించాలని నిర్ణయించింది. దీంతో మహారాష్ట్ర రైతులు ఏటా రూ.12,000 పొందుతారు. ఈ మొత్తం నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ అవుతాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అధ్యక్షతన సోమవారంనాడు సమావేశమైన మంత్రివర్గం.. 'నమో షెట్కారి మహాసన్మాన్ యోజన' కింద ఈ పథకాన్ని ఆమోదించింది. సమావేశానంతరం క్యాబినెట్ నిర్ణయాన్ని షిండే మీడియా ముందు ప్రకటించారు.

''ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం నిర్ణయం తీసుకున్నాం. రైతులకు ఏటా రూ.6,000 ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతే మొత్తంలో రైతులకు ఏటా రూ.6000 ఏటా అందిస్తుంది'' అని షిండే తెలిపారు. కాగా, కోటి మందికి పైగా రైతులు ఇందువల్ల లబ్ధి పొందుతారని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఆర్థిక మంత్రిగా కూడా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ 2023-24 బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు.

Updated Date - 2023-05-30T19:45:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising