ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mamata Banerjee : మహాభారతాన్ని కాజీ నజ్రుల్ ఇస్లాం రాశారు : మమత బెనర్జీ

ABN, First Publish Date - 2023-08-30T12:46:19+05:30

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) మాటలు ఇటీవల తడబడుతున్నాయి. ఒకరి పేరు చెప్పబోయి మరొకరి పేరు చెప్తూ ఇబ్బంది పడుతున్నారు. చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఆమె మాట్లాడుతూ, రాకేశ్ రోషన్ గతంలోనే చందమామపై అడుగు పెట్టాడని చెప్పారు.

Mamata Banerjee

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) మాటలు ఇటీవల తడబడుతున్నాయి. ఒకరి పేరు చెప్పబోయి మరొకరి పేరు చెప్తూ ఇబ్బంది పడుతున్నారు. చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఆమె మాట్లాడుతూ, రాకేశ్ రోషన్ గతంలోనే చందమామపై అడుగు పెట్టాడని చెప్పారు. తాజాగా ఆమె మాట్లాడుతూ, మహాభారతాన్ని కాజీ నజ్రుల్ ఇస్లామ్ రాశారని చెప్పారు. ఆమె ఇలా ఎందుకు తడబడుతున్నారోనని టీఎంసీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ 1984 ఏప్రిల్‌లో చంద్రునిపై అడుగు పెట్టారు. సోవియెట్ యూనియన్ ప్రయోగించిన ఇంటర్‌కాస్మోస్ ప్రోగ్రామ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారత పౌరుడు ఆయనే కావడం విశేషం. ఈ విషయాన్ని మమత బెనర్జీ ప్రస్తావిస్తూ, రాకేశ్ శర్మకు బదులుగా రాకేష్ రోషన్ అని చెప్పారు. అదేవిధంగా మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని కూడా ప్రస్తావించారు. ఇందిరా గాంధీ చంద్రునిపైకి వెళ్లారన్నారు. చంద్రునిపై నుంచి చూస్తే భారత దేశం ఎలా ఉందని రాకేశ్ రోషన్‌ను ఇందిర అడిగారని చెప్పారు. రాకేష్ రోషన్ బాలీవుడ్ ప్రముఖుడనే సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్ అవడంతో మమతపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, ఆనందించారు.


టీఎంసీపీ ఫౌండేషన్ డే కార్యక్రమంలో మమత బెనర్జీ మంగళవారం మాట్లాడుతూ, కేవలం బడిలో చదువుకున్నంత మాత్రానికి వాస్తవ జ్ఞానం రాదని, విశాలమైన మనసు ఉండాలని చెప్పారు. మనలో ఉన్న గొప్పవారు రచించిన రచనలను చదివి అర్థం చేసుకోవాలని కోరారు. రవీంద్రనాథ్ ఠాగూర్, నజ్రుల్ ఇస్లాం, వివేకానంద రచనలను చదవాలన్నారు. మహాభారతాన్ని నజ్రుల్ ఇస్లామ్ రాశారని చెప్పారు.

కాజీ నజ్రుల్ ఇస్లామ్ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పద్యాలు రాసేవారు. మత సామరస్యం కోసం కూడా ఆయన రచనలు చేశారు. మహాభారతాన్ని వేద వ్యాసుడు రాసిన సంగతి తెలిసిందే. మమత వ్యాఖ్యలపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి :

BJP : యోగి ఆదిత్యనాథ్‌పై వరుణ్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు

Modi Vs Rahul Gandhi : భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది.. మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. : రాహుల్ గాంధీ

Updated Date - 2023-08-30T12:56:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising