ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Liquor Scam:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. మనీష్ సిసోదియా కస్టడీ పొడగించిన కోర్టు

ABN, First Publish Date - 2023-10-19T15:09:24+05:30

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. గురువారం ఆయన్ని కోర్టులో హాజరుపరచగా సిసోదియా రిమాండ్ ను నవంబర్ 22వరకు పొడగించాలని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది.

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. గురువారం ఆయన్ని కోర్టులో హాజరుపరచగా సిసోదియా రిమాండ్ ను నవంబర్ 22వరకు పొడగించాలని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. లిక్కర్ స్కాంలో డాక్యుమెంట్లను తనిఖ ీచేయాలని నిందితుల తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. సీబీఐ వేసిన ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది. ఈ కుంభకోణంలో సిసోడియా పాత్ర ఉందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 26న సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది.


అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. మనీలాండరింగ్ కేసులో సిసోడియాను తీహార్ జైలులో విచారించిన తర్వాత మార్చి 9న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ మంత్రివర్గం నుంచి సిసోడియా రాజీనామా చేశారు. ఢిల్లీ లోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నవంబర్ 17, 2021న లిక్కర్ స్కాం విధానాన్ని అమలు చేసింది. అయితే అవినీతి ఆరోపణల కారణంగా సెప్టెంబర్ 2022 చివరిలో దానిని రద్దు చేసింది. అలా లిక్కర్ టెండర్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. అప్పటి నుంచి లిక్కర్ స్కాంలో దేశంలోని చాలా మంది కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. సిసోదియా పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడాన్ని ఆప్ ఖండించింది. ఎలాంటి తప్పు చేయకుండా సిసోదియాను అరెస్ట్ చేయడం ఏంటని సీబీఐ అధికారులను ప్రశ్నిస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని.. అవి బీజేపీ చేతిలో పెంపుడు కుక్కలా మారాయని ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార బీజేపీ ఈ ఆరోపణల్ని ఖండించింది. అకారణంగా దర్యాప్తు సంస్థలు ఎవర్నీ విచారించవని.. తప్పు చేసిన వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని అంటున్నారు. ఈ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-10-19T15:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising